న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రాన్ని దాటి జాతీయస్థాయిలో రాజకీయాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్ ఆదేశాలతో దేశ రాజధానిలో పార్టీ కార్యాలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు నిర్మాణ పనుల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ భవన నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల అనుమతులు తీసుకోవటంతో పాటు శుక్రవారం ఢిల్లీలో లాంఛనంగా భవన్ నిర్మాణ పనులు ప్రారంభించినట్టు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ విధించిన నిర్ణీత గడువులోగా టిఆర్ఎస్ భవన్ నిర్మాణం పూర్తవుతుందని ఎంపీ నామ నాగేశ్వర రావు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే నిర్మాణ కంపెనీతో జరిగిన సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
దేశ రాజధానిలో టీఆర్ఎస్ భవన్ పనులు ప్రారంభం.. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నిర్మాణం
Advertisement
తాజా వార్తలు
Advertisement