తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగలనుంది. ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ బీజేపీలో చేరనున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్న ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన అనుచరులు, అభిమానులతో చర్చించిన ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుచరుల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీ మారాలనే యోచనలో రమేష్ రాథోడ్ ఉన్నారు. ఇప్పటికే అనేక మంత్రి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్, బీజేపీలో చేరారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గట్టి లీడర్ గా ఉన్న రమేష్ రాథోడ్ బీజేపీలో చేరితే కాంగ్రెస్‌కు కొంత మేర నష్టం కలిగే అవకాశాలున్నాయి.
మరోవైపు రమేష్ రాథోడ్ చేరికతో ఆదిలాబాద్‌లో బీజేపీ బలపడనుంది. గతంలో ఆదిలాబాద్ ఎంపీగా రమేష్ రాథోడ్ గెలిచారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే, టీఆర్ఎస్‌లో తనకు సరైన ప్రాధాన్యం దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్‌లో కూడా ఆయనకు సరైన గుర్తింపు దక్కక పోవడంతో బీజేపీ వైపు చూస్తున్నారు. ఈ నెల 14న మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో పాటు రమేష్ రాథోడ్ కూడా బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి.