Friday, November 22, 2024

Twitter: నిధి చౌద‌రిపై ట్రోలింగ్‌.. జాకెట్ వేసుకోకుండా నీతులు చెబుతావా అంటూ కామెంట్స్‌!

సోషల్​ మీడియా అంటేనే విపరీతమైన స్వేచ్ఛకు నిదర్శనం.. అందులో దేనిపైన అయిన జనాలు ఇష్టమున్నట్టు కామెంట్స్​ చేయడం, పోస్టులు పెట్టడం చేయొచ్చు. వ్యక్తిగత అంశాలతో పాటు సామాజిక, రాజకీయ అంశాలపై చర్చించొచ్చు. ఇది అన్​టిమిటెడ్​, అన్​స్టాపబుల్​గా ఉంటుంది. అయితే.. ఈ మధ్య ఒక వేషధారణపై ట్విట్టర్​, సోషల్​మీడియాలో విపరీతమైన ట్రోలింగ్​ జరుగుతోంది. నిధి చౌదరి అనే ఆస్ట్రాలజీ​, ఫ్యాషన్​ స్టైలిస్ట్​ని ఇప్పుడు అంతా టార్గెట్​ చేశారు. ఎందుకంటే తాను పోస్టు చేసిన ఒక వీడియోలో జాకెట్​ వేసుకోకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది.
– డిజిటల్​ మీడియా, ఆంధ్రప్రభ

ట్విట్టర్ ప్రపంచంలోని కొన్ని పోస్టులు చాలామందికి స్ఫూర్తిని కలిగిస్తాయి. ఇంకొన్న కోపం తెప్పిస్తాయి. కొంతమంది ప్రతి విషయాన్ని ప్రశ్నించేలా చేస్తారు. ఇంకొంతమంది సొల్లు, సోదీ అంతా పోస్టు చేస్తుంటారు.. అయితే.. ఒక యంగ్​ లేడీ మాత్రం ఇవ్వాల అనేక ట్వీట్లు, రీట్వీట్లతో ట్విట్టర్​లో ట్రెండ్​ అవుతోంది. ఈరోజు ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్ టాపిక్‌లలో ‘నిధి’ ఒకటిగా నిలిచింది. దీనికి గల కారణాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఏం తెలిసింది అంటే.. ఈ విషయం చెప్పాలంటేనే వింతగా అనిపిస్తోంది.

నిధి చౌదరి ట్విటర్‌లో 15.5కె మంది స‌బ్‌స్క్రబ‌ర్స్‌ని కలిగి ఉన్న జ్యోతిష్యురాలు. కొన్ని వారాల క్రితం ఆమె చేసిన ట్వీట్‌లలో ఒకటి బెస్ట్‌గా నిలిచింది. “అవును! నేను లాయర్‌ని, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ని, ఫ్యాషన్ స్టైలిస్ట్‌ని. నేను జ్యోతిష్యం, టారో పఠనం, వాస్తు వంటివి చెబుతాను. అంతేకాకుండా నేను సెక్సీగా కనిపించడానికి ఇష్టపడతాను” అని ఆమె త‌న పోస్టులో రాసింది.

ఇక‌.. నిధి చౌదరి మైక్రోబ్లాగింగ్ వెబ్‌సైట్‌లో నిరుపేద వ్యక్తులు ఎలా ధ‌న‌వంతులు కావాలో, డ‌బ్బుల‌ను దుర్వినియోగం చేయకుండా శని ప్ర‌భావం నుండి ఎలా దూరంగా ఉండవచ్చో వివరిస్తూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. పేద‌ల‌తో ఎలా ప్రవర్తించాలి.. వీలైనప్పుడల్లా వారికి ఎలా సహాయం చేయాలి అనే దాని గురించి కూడా వివ‌రించింది. కానీ, ప్రజల దృష్టిని ఆకర్షించింది ఏంటంటే.. జ్యోతిష్యం నుండి పూర్తిగా డిస్‌కనెక్ట్ అయ్యేలా ఆమె వేషధారణ ఉండడ‌మే ఇక్క‌డ ప్ర‌ధాన కార‌ణం.

ఈ యంగ్ లేడీ.. నీలిరంగు చీరను క‌ట్టుకుని, బ్లౌజ్‌ని వేసుకోవ‌డం మ‌రిచిపోయిన‌ట్టుంది. ఆమె ఎడమ చేతికి వెండి ఆభరణాలు, రుద్రాక్షలు ఇతర మతపరమైన దారాలు, నల్ల బిందీ, చక్కగా చేసిన అలంకరణతో ఆమె దుస్తులు వేసుకున్నా.. జాకెట్ వేసుకోక‌పోవ‌డం ఇక్క‌డ పెద్ద మైన‌స్ పాయింట్ అయ్యింది. అయితే.. ఆమె ప్రైవేట్ పార్ట్స్ ఏవీ క‌నిపించ‌కున్నా, ఆమె వస్త్రధారణ అసభ్యంగా లేన‌ప్ప‌టికీ బ్లౌజ్ లేకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

బ్లౌజ్‌తో ఆమె ఏమి చేసి ఉంటుందో వివరిస్తూ అనేక అసహ్యకరమైన ట్వీట్లు ఆమెకు సెండ్ చేశారు. ఒక వ్యక్తి బ్లౌజ్ కొనుక్కోవడానికి ఆమెకు డబ్బు పంపిస్తానని ఆఫర్ చేశాడు. మ‌రో వ్య‌క్తి ఆమె UPI IDకి రెస్పాండ్ అయ్యాడు. అత‌ను 101 రూపాయలు పంపిన వెంటనే అక్క‌డ మీమ్స్ ప్ర‌త్య‌క్షం అయ్యాయి.

“బ్రహ్మాస్త్రాన్ని చూసే బదులు.. బ్లౌజ్ కొనలేని ఈ పేద మహిళకు 500/- విరాళం ఇవ్వండి. వెనుకబడిన వారికి సహాయం చేయండి” అని ఒక నెటిజ‌న్ రాశారు. “మాకు ఆమె సలహా అవసరం లేదు. ఆమెకు బ్లౌజ్ కావాలి” అని మరొకరు రాశారు. ఇప్పుడీ కామెంట్స్‌, ట్రోలింగ్ అంతా ట్రెండ్‌గా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement