Friday, November 22, 2024

గ్లోబ‌ల్ గా మారుతోన్న త్రిపుర.. అంబాస్సా ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌ధాని మోడీ

ఈశాన్య రాష్ట్రం దక్షిణాసియా ‘గేట్ వే’గా మారబోతోందని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. అంబాస్సాలో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన్ని ఆయ‌న ప్ర‌సంగించారు . దేశ నిర్మాణంలో గిరిజన ప్రజల కృషిని గుర్తించడానికి బీజేపీ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. త్రిపురలో హీరా హైవేలు, ఇంటర్నెట్ వేస్, రైల్వేలు-ఎయిర్ వేస్ కు తాను హామీ ఇచ్చానని, ప్రాజెక్టుల డెలివరీని ప్రజలు చూడగలరన్నారు. త్రిపురలో జాతీయ రహదారుల పొడవును రెట్టింపు చేసే పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు. త్రిపుర‌లో అభివృద్ది ప‌నులు వేగంగా జ‌రుగుతున్నాయ‌ని తెలిపారు. త్రిపురలో గ్రామాల్లో ఆప్టికల్ ఫైబర్ వేసే పనులు జరుగుతున్నాయి. గత ఎనిమిదేళ్లలో త్రిపురలో మూడు రెట్లు ఆప్టికల్ ఫైబర్ వేశారు. త్రిపురలోని గ్రామాలను కలుపుతూ 5,000 కిలోమీటర్ల మేర కొత్త రహదారులను నిర్మించారు.

అగర్తలాలో కొత్త విమానాశ్రయాన్ని కూడా నిర్మించారు. ఆప్టికల్ ఫైబర్, 4జీ కనెక్టివిటీని గ్రామాలకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు త్రిపుర గ్లోబల్ గా మారుతోంది. ఈశాన్య, త్రిపురలను ఓడరేవులతో కలిపేందుకు జలమార్గాలను అభివృద్ధి చేస్తున్నాం. త్రిపుర దక్షిణాసియా ముఖద్వారంగా మారబోతోంది” అని మోడీ పేర్కొన్నారు. ‘గృహనిర్మాణం-ఆరోగ్యం-ఆదాయం’ అనే మూడు అంశాలు త్రిపురకు సాధికారత కల్పిస్తున్నాయని ప్రధాన మంత్రి మోడీ అన్నారు. పీఎం ఆవాస్ యోజన ఇక్కడి పేద ప్రజల జీవితాలను మార్చిందని ఆయన అన్నారు. గత ఐదేళ్లలో బీజేపీ ప్రభుత్వం పేదల కోసం 3 లక్షల పక్కా ఇళ్లు నిర్మించిందన్నారు. బీజేపీ మీ సేవకుడిగా, మీ నిజమైన సహచరుడిగా… మీ ప్రతి ఆందోళనను తొలగించడానికి రాత్రింబవళ్లు కష్టపడుతోంది అని ఆయన అన్నారు. త్రిపురలో వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీలు అభివృద్ధిని అడ్డుకున్నాయని ప్రధాని మోడీ విమర్శించారు. త్రిపురలో ప్రజల ఆదాయాన్ని పెంచడంపై బీజేపీ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. పీఎం కిసాన్ కింద రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఈ మొత్తాన్ని పెంచుతామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement