Tuesday, November 19, 2024

The King: త్రిపుర ఆధునిక నిర్మాత.. బిర్ బిక్రమ్ కిషోర్ డెబ్బర్మాన్

త్రిపుర‌లోని అగర్తలాలో మహారాజా బిర్ బిక్రమ్ విమానాశ్రయం కొత్త టెర్మినల్ భవనాన్ని ఈ మధ్యనే ప్రధాని న‌రేంద్ర మోడీ ప్రారంభించారు. బిర్ బిక్రమ్ కిషోర్ త్రిపుర‌ను పాలించిన రాజుగా గుర్తింపు పొందారు. మాణిక్య వంశానికి చెందిన ఈ రాజు 1908లో పుట్టారు. త్రిపుర‌ను పాలించిన చివ‌రి రెండో మ‌హారాజు కాగా, 1947 వ‌ర‌కు కింగ్ గా వ్యవహరించారు. 1949లో భార‌త్‌లో త్రిపుర క‌లిసే వ‌ర‌కు తాత్కాలిక రాజుగా కొన‌సాగారు. త్రిపుర అభివృద్ధిలో బిర్ బిక్రమ్ కిషోర్ కీల‌క‌పాత్ర పోషించారు. ఈయ‌న్ను త్రిపుర ఆధునిక నిర్మాత‌గా పేర్కొంటారు. ప్రస్తుతమున్న త్రిపుర‌ను ఈయ‌న కాలంలోనే ప్లాన్ చేశారు.

భూ సంస్కరణల్లో మార్గదర్శకుడిగా బిర్ బిక్రమ్ కిషోర్ రాజును చెప్పుకుంటారు. 1939లో స్థానిక త్రిపుర గిరిజ‌నుల కోసం భూమిని రిజర్వు చేశారు. త్రిపుర స్వయం ప్రతిప‌త్తి జిల్లా కౌన్సిల్ ఏర్పాటులో ముఖ్య పాత్ర పోషించారు. త్రిపుర‌లో తొలి విమానాశ్రయం అగ‌ర్తలాలో ఈయ‌నే క‌ట్టించారు. కాగా, ముఖ్యమంత్రి త్రిపుర గ్రామ సమృద్ధి యోజన  ప‌థ‌కం ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీరు, ప‌క్కా ఇళ్లు, ఆయుష్మాన్ ప‌థ‌కం, బీమా, KCC (కిసాన్ క్రెడిట్ కార్డ్) గ్రామాల్లో రోడ్లు వేయిస్తారు. విద్యాజ్యోతి పాఠశాలల ప్రాజెక్ట్ మిషన్ 100 ద్వారా ప్రస్తుత‌మున్న 100 హయ్యర్ సెకండరీ పాఠశాలల్లో అత్యాధునిక సౌకర్యాలు, నాణ్యమైన విద్య అందించే ల‌క్ష్యంతో ఈ ప‌థ‌కం చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద న‌ర్సరీ నుంచి ఏడ‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌ను విద్యాంతులు చేస్తారు. మూడేళ్లలో దాదాపు 500 కోట్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement