ఈశాన్య రాష్ట్రం త్రిపురలో రాజకీయంగా శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. త్రిపుర సీఎం పదవికి బీజేపీ నేత బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామా చేశారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకే బిప్లవ్ తన పదవికి రాజీనామా చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. కాగా, 2018లో త్రిపుర సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగా… గడచిన నాలుగేళ్ల పాటు ఆయన ప్రభుత్వాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండానే నడిపించారు. అయితే అనూహ్యంగా ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో బిప్లవ్ స్థానంలో త్రిపుర సీఎం పదవికి మరో కొత్త నేతను బీజేపీ అధిష్టానం ఎంపిక చేయనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement