పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బెంగాల్ లో కేంద్రమంత్రి మురళీధరన్ కారుపై దాడి జరిగింది. కొందరు వ్యక్తలు కర్రలు, రాళ్లతో మంత్రి ప్రయాణిస్తున్న వాహనంపై దాడి చేశారు. పశ్చిమ మిడ్నాపూర్ లోని పంచక్కుడిలో ఈ ఘటన జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిలో కేంద్రమంత్రి మురళీధరన్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడిలో తన వ్యక్తిగత సిబ్బందికి గాయాలు అయ్యాయని మురళీధరన్ తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలే తనపై దాడికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. తన వాహనంపై దాడికి సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
కాగా, బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి వరుసగా హింస చోటుచేసుకోవడం పట్ల బెంగాల్ గవర్నర్ నుంచి కేంద్రం నివేదిక కోరింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన ఘటనలపై ఇప్పటికే నలుగురు సభ్యుల కమిటీని నియమించింది.