మాలయాళ సినీ ఇండస్ట్రీలో #MeToo ప్రకంపణలు మళ్లీ మొదలయ్యాయి. మలయాళ నటుడు-నిర్మాత విజయ్ బాబు తనను ముద్దుపెట్టుకోవడానికి ట్రై చేశాడని ఓ నటి ఆరోపించింది. కాగా, ఇప్పటికై విజయ్‌బాబుపై లైంగిక వేధింపుల కేసు ఒకటి ఉంది. ఈ సంఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, సినీ పరిశ్రమకు కూడా దూరంగా ఉంచిందని ఆమె అన్నారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. విజయ్ బాబుపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత మరో మహిళ ఈ సంఘటనను నిర్భయంగా వెల్లడించింది.
“అతను మద్యం తాగి నాకు కూడా ఇచ్చాడు. నేను నిరాకరించాను. ఆ తర్వాత నా పని కొనసాగించాను. అయితే అకస్మాత్తుగా అతను నా పెదవులపై ముద్దు పెట్టుకోవడానికి నా మీదికి ఒరిగాడు.. అదృష్టవశాత్తూ దానికి నేను వెంటనే రియాక్ట్ అయ్యాను. అతని నుంచి వెటనే దూరం జరిగి, అతని ముఖంలోకి చూశాను. ఆపై అతను ఒక్క ముద్దు? ప్లీజ్ అంటూ అడిగాడు” అని ఆమె ఒక పోస్ట్ లో పేర్కొంది.
కాగా, అత్యాచారం కేసులో పోలీసులు లుకౌట్ నోటీసు జారీ చేయడంతో నటుడు విజయ్‌బాబు ముందస్తు బెయిల్ కోరుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని, అతనిపై అత్యాచారం కేసు నమోదైన వెంటనే దేశం విడిచిపెట్టినట్లు సమాచారం.
కేసు వివరాలు ఏంటంటే..
మహిళా నటికి సంబంధించిన ప్రారంభ సంఘటన ఏప్రిల్‌లో జరిగింది. విజయ్ బాబు తనను లైంగికంగా వేధిస్తూ నెల రోజుల పాటు వేధింపులకు పాల్పడ్డాడని ఆమెతెలిపింది. అతని బారి నుంచి ప్రాణాలతో బయటపడిన మహిళ ‘లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా మహిళలు’ అనే పేరుతో ఉన్న ఫేస్‌బుక్ గ్రూప్‌లో ఒక పోస్ట్ పెట్టింది. తనపై జరిగిన లైంగిక వేధింపుల వివరాలను తెలియజేసింది.
సినిమా పరిశ్రమలో మంచి అవకాశాలు ఇప్పిస్తానని విజయ్‌బాబు తన అపార్ట్ మెంట్‌లో పలుమార్లు చిత్రహింసలకు గురిచేశాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు ఆధారంగా ఎర్నాకులం సౌత్ పోలీసులు ఏప్రిల్ 22న విజయ్ బాబుపై కేసు నమోదు చేశారు. బాధితురాలి పేరును ఎవరైనా బహిరంగంగా వెల్లడించడాన్ని చట్టం నిషేధిస్తుంది. ఫేస్‌బుక్ లైవ్‌లో ఆమె గుర్తింపును వెల్లడించడం ద్వారా విజయ్ బాబు అతనిపై అదనపు ఆరోపణలను ఆహ్వానించారు. అయితే ఇంతకుముంద కూడా సహ నిర్మాత సాండ్రా థామస్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి.. అయితే ఆ వెంటనే కేసు ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది.