Tuesday, November 26, 2024

Tributes – న‌భూతో… న‌భవిష్య‌తి – నంద‌మూరి తార‌క‌రాముని వైభోగం..

నందమూరి తారక రామారావు – యన్‌.టి.రామారావు – యన్టీఆర్‌ – యన్టీవోడు… ఇలా పలు విధాల తెలుగుజనం పలవ రిస్తూ నే ఉంది. యన్టీఆర్‌ భౌతికంగా మనల్ని వీడి 27 ఏళ్ళయింది. అయి నా ఆయన కీర్తిపతాక ఇంకా ఎగురుతూనే ఉంది. ఆయన ఘనకీర్తి వసివాడక వెలుగుతూనే ఉండడం విశేషం. యన్టీఆర్‌ కంటే ముందు ఎందరో మహానటు-లు కాలం చేసినా, కాలచక్రం వారిని గిర్రున తన తో తిప్పుకుంటూ పోయింది. కానీ, యన్‌.టి.ఆర్‌. అన్న మూడక్షరాల పేరు ఈ నాటికీ తెలుగువారి చెవిన పడగానే వారి మది పులకించి పోతూ ఉంది. మే 28న యన్‌.టి.ఆర్‌. శతజయంతి సంపూర్తి అవుతోంది. ఆయన నెలకొల్పిన తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. అయినా, తెలుగునేలపై ఊరూరా వాడవాడలా మే 28వ తేదీన అభిమానజనాలు ఎవరికి తగిన రీతిలో వారు యన్టీఆర్‌ కు జోహార్లు అర్పించడానికి సంసిద్ధులవుతున్నారు. ఇంతటి ఘనచరిత సొంతం చేసుకున్న యన్టీఆర్‌ ను భావితరాలు సైతం మరచిపోలేరు.

తెలుగు చిత్రసీమలోనూ, భారతావనిలో, ప్రపంచ వ్యాప్తం గా ఎందరో మహానటు-లు ఉన్నారు. అయితే యన్టీఆర్‌ పేరు ముందే విశ్వవిఖ్యాత నటసార్వ భౌముడు అన్న బిరుదు నిలచి జనం మదిని గెలిచింది. కొందరు అదే మకుటాన్ని తమ పేరు ముందు ఉంచుకు న్నా, లేక వారి అభిమానులే ఉంచినా, ఎవ రూ అంతగా గౌరవించక పోవడం గమ నార్హం! ఒకప్పుడు యన్టీఆర్‌ను ఓ మఠా ధిపతి విశ్వవిఖ్యాత నటసార్వ భౌమా… అంటూ సంబోధించగా, దానినే ఆ తరువా త నుంచీ యన్టీఆర్‌ పేరు ముందు ప్రకటిస్తూ తమ అభిమానాన్ని చాటు-కున్నారు అభి మానులు…

అప్పట్లో విశ్వం అంటే ఆంధ్రప్రదేశా? అంటూ కొందరు వెకిలిగా నవ్వినవారూ లేకపో లేదు. అయితే తెలుగుతెరపై అనితర సాధ్యంగా 48 పౌరాణిక చిత్రాలలోనూ, 57 జానపద సినిమాల్లోనూ నటించి ప్రపంచ రికార్డు నెలకొ ల్పిన సంగతి సదరు జనం గమనించ లేదేమో అనుకున్నారు అన్న అభిమానగణాలు. అయితే అనితర సాధ్యంగా సాగిన యన్టీ ఆర్‌ అభినయ పర్వంలోని పౌరాణిక, చారిత్రక, జానపద, సాంఘిక చిత్రాలను పరిశీలిస్తే, ఆయన కోసమే సదరు పాత్రలు పుట్టాయేమో అనిపించక మానదు. శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీనివాస, శివుడు వంటి పురాణపురుషుల పాత్ర ల్లో మరొకరిని ఊహించని విధం గా నటరత్న నటనావైభవం సాగింది. ఇక శ్రీకృష్ణదేవరాయలు, పల్నాటి బ్రహ్మనా యుడు, యోగి వేమన, బ్రహ్మంగా రు వంటి పాత్రల కోసమే రామారావు జన్మిం చారేమో అనిపిస్తుంది. నిజానికి సదరు పాత్రలు ఎలా ఉన్నాయో ఎవరికీ తెలియదు. కానీ, చరిత్ర చెబుతున్నట్టు-గా శ్రీకృష్ణదేవరా యలు పొట్టిగా, నల్లగా ఉండేవారని తెలు స్తోంది. కానీ, యన్టీఆర్‌ ను చూశాక, కృష్ణరా యలంటే రామారావులాగే ఉంటా రని జనం కీర్తించసాగారు.

ఇక జానపద కథానాయకునిగా యన్టీఆ ర్‌ అభినయపటిమ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తెలుగునాటనే కాదు, యావత్ప్ర పంచంలోనే జానపదాల్లో అంతటి వైవిధ్యం చూపిన నటు-డు మరొకరు కానరారు. ఇక తాను నటించిన 302 చిత్రాల్లో దాదాపు మూడింట రెండువంతుల చిత్రాల్లో మారువేషాలు వేసి యన్టీఆర్‌ అలరించిన వైనాన్ని తెలుగుజనం ఏ నాటికీ మరచిపోలేరు. ఇన్నివిధాల నటరత్న నటనావైభవం సాగిన తరువాత ఆయనకు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ అన్న బిరుదును ఆపాదించడం నూటికి నూరుపాళ్ళ ఒప్పు! అది తప్పని ఆనాడు అన్నవారిని ఏమనుకోవాలో ఊహించుకోవచ్చు! నటు-నిగా తనదైన బాణీ పలికించిన యన్టీఆర్‌ తెలుగునాట ఎన్నెన్నో తరగిపోని, చెరిగిపోని రికార్డులు సృష్టించారు. భావితరా లు సైతం ఆ సత్యాన్ని గ్రహించి, అబ్బుర పడుతున్నాయి. అందుకు నిదర్శనం ఇటీ-వల కూకట్‌ పల్లిలో జరిగిన యన్టీఆర్‌ శతజయంతి వేడుకల్లో నవతరం కథానాయకులు ఎందరో ఆయన నటనావైభవాన్ని గుర్తు చేసుకొని మురిసిపోవడమే నిదర్శనం! ఈ రోజున పాన్‌ ఇండియా మూవీస్‌ అన్న పదం విశేషంగా వినిపి స్తోంది. యన్టీఆర్‌ ఏ నాడో పాన్‌ ఇండియా మూవీస్‌ చూశారు అంటూ రామ్‌ చరణ్‌ గుర్తు చేయడం గమనార్హం! ఇలాంటి సత్యాలు తెలిసిన వారు యన్టీ ఆర్‌ గొప్పద నాన్ని అంగీకరిస్తారు.

- Advertisement -

యన్టీఆర్‌ రాజకీయనాయకుడుగానూ రాణించడంతో కొందరు ఆయ న ప్రతిభను అంగీకరించేందుకు తటపటా యిస్తా రు. ఏది ఏమైనా తెలుగువా రు మాత్రం యన్టీఆర్‌ తమ వారైనందుకు గర్విస్తారు. ప్రపంచంలో అత్యధిక పౌరా ణిక చిత్రాల్లోనూ, అత్యధిక జానపదాల్లోనూ మురిపిం చిన ఘనత సొంతం చేసుకున్న యన్టీఆర్‌ తన నట జీవితం లో మొత్తం 302 చిత్రాల్లో నటించారు.
మన దేశంలో తొలిసారి వంద చిత్రాలు పూర్తి చేసుకు న్న హీరోగా గుండమ్మ కథ (1962)తో చరిత్ర సృష్టించారు. ఆ పై 1970లో కోడలు దిద్దిన కాపురంతో 200 చిత్రాల మైలురాయి దాటి, ఆ ఘనత సాధిం చిన తొలి కథానా యకునిగా నిలిచారు. తెలుగు నాట 300 చిత్రాలు చూసిన తొలి స్టార్‌గా మేజర్‌ చంద్రకాం త్తో చరిత్ర కెక్కారు. ఇవన్నీ ఒ క ఎత్తను కుంటే దర్శకునిగానూ 18 చిత్రా లు తెరకెక్కించి, వాటిలో పౌరాణిక, జానపద, చారిత్రక, సాంఘికా లతో విజ యాలు చూసిన ఏ-కై-క దర్శకునిగానూ నిలిచారు. శ్రీకృష్ణ పాత్రలో పాతిక సార్లు తెరపై కనిపించి ఓ పౌరాణిక పాత్రలో అన్ని సార్లు నటించిన ఏ-కై-క నటు-నిగా ప్రపంచరికార్డు సృష్టించారు.

శ్రీరామ పాత్రలో 12 సార్లు నటించిన యన్టీఆర్‌ రావణా సురునిగా ఐదుసార్లు, దుర్యోధనునిగా నాలుగు సార్లు తెరపై తళుక్కుమనీ అలరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే జానప దాల్లోనూ పలు వైవిధ్యమైన పాత్రలు ధరించి యన్టీఆర్‌ అల రించిన తీరు వివరించడానికి స్థలం చాలదని భావించాలి. సాంఘికాల్లో అయితే అధిక శాతం చిత్రాల్లో జనం కోసమే మనం అంటూ సాగారు. అందుకే యన్టీఆ ర్‌ జనం మదిలో విశ్వవిఖ్యాత నటసార్వభౌముడుగా నిలిచారు.

అనితరసాధ్యంగా సాగిన అభినయరత్న వైభ వం రాజకీయాల్లోనూ అదే తీరున జైత్రయాత్ర చేయ డం గమనార్హం! 1982 మార్చి 28న తెలుగుదేశం పార్టీని నెలకొల్పి, కేవలం తొమ్మిది నెలల వ్యవధి లో కాంగ్రెస్‌ కంచుకోటలో పాగావేసి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా గెలిచి చరిత్ర సృష్టించారు యన్టీ ఆర్‌. 1984 ఆగస్టు సంక్షౌభంలో వెన్నుపోటు-కు గురి కాగా, ప్రజాబలంతో పోరాటం చేసి నెల వ్యవ ధిలోనే 1984 సెప్టెంబర్‌ 15న మళ్ళీ ముఖ్య మంత్రి కాగలిగిన ఘన చరిత్ర సైతం యన్టీఆర్‌ సొంతం. 1985లో మరోమారు ముఖ్యమంత్రి గా ప్రమాణం చేశారు రామా రావు. ఇలా 1983, 1984, 1985 – వరుసగా మూడు సంవత్సరాలు ముఖ్య మంత్రిగా ప్రమా ణం చేసిన అరుదైన చరిత్ర కూడా యన్టీ ఆర్‌ సొంతమయింది. ఇక 1994లో అనూహ్య విజయం సాధించి, అంతకు ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ను కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా తగని విధంగా ఓడించిన ఘనత కూడా రామారావు సొంతమే! 1995 రెండవ ఆగస్టు సంక్షౌభంలో పదవీచ్యు తుడైనా జనం మదిలో మాత్రం తన స్థానం చెరిగిపోని విధంగా నిలుపుకున్నారు రామారావు. 1996 జనవరి 18న కన్నుమూసిన తరువాత నుంచీ ప్రతి యేడాది యన్టీఆర్‌ జయంతి, వర్ధంతి సందర్భాల్లో తెలుగు వారు ఎక్కడ ఉన్నా యన్టీఆర్‌ను స్మరిస్తూ సాగడం మరవ కూడని అంశం!

Advertisement

తాజా వార్తలు

Advertisement