Friday, November 22, 2024

ఉద్యోగాలు జాత‌ర – 9,231 ఉద్యోగాల భర్తీకి ట్రిబ్ నోటిఫికేషన్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. ఈక్రమంలోనే విడతల వారీగా నోటిఫికేషన్లు విడు దలవుతున్నాయి. ఎప్పుడెప్పుడా అని లక్షలాది మంది ఉద్యోగార్థులు ఎదురుచూసిన గురుకుల టీచర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇదే క్రమంలో భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. రాష్ట్రం లోని గురుకులాల సొసైటీల్లో 9,231 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఏకంగా ఒకేసారి 9 నోటిఫికేషన్లు విడుదల య్యాయి. ఈ మేరకు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ రిక్రూ ట్‌మెంట్‌ బోర్డు (ట్రిబ్‌) నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం ఖాళీల్లో డిగ్రీ లెక్చరర్‌ పీడీ, జూనియర్‌ లెక్చరర్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ), ట్రైయిన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్స్‌(టీజీటీ), పీడీ, లైబ్రేరియన్‌, ఫిజికల్‌ డైరెక్టర్స్‌ ఇన్‌ స్కూల్స్‌, డ్రాయింగ్‌ టీచర్స్‌ ఆర్ట్‌ టీచర్స్‌, క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, క్రాఫ్ట్‌ టీచర్స్‌, మ్యూజిక్‌ టీచర్స్‌ పోస్టులు ఉన్నాయి. అయితే ఈనెల 12వ తేదీ నుంచి అభ్యర్థులు తమ వివరాలను గురుకుల వెబ్‌సైట్‌లో ఓటీఆర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

అయితే ఈ పోస్టులకు సంబంధించి వేరువేరుగా మొత్తం 9 నోటిఫికేషన్లు విడుదల చేశారు. గురుకుల డిగ్రీ కళాశాలలో లెక్చరర్‌ పోస్టులు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్‌ 868 పోస్టులకు సంబంధించిన మొదటి నోటిఫికేషన్‌కు ఈనెల 17 నుంచి మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. రెండో నోటిఫికేషన్‌లో గురుకుల జూనియర్‌ కాలేజీలోని 2008 పోస్టులకు ఈనెల 17 నుంచి మే 17 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మూడో నోటిఫికేషన్‌లో పోస్టుగ్రాడ్యుయేట్‌ టీచర్‌ పీజీటీలో 1276 పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు, నాల్గో నోటిఫికేషన్‌లో గురుకుల స్కూల్స్‌ లైబ్రేరియన్‌ 434 పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు, ఐదో నోటిఫికేషన్‌లో ఫిజికల్‌ డైరెక్టర్‌ 275 పోస్టులకు సంబంధించిన ఉద్యోగాలకు ఈనెల 24 నుంచి మే 24 వరకు దరఖాస్తులు స్వీకరించ నున్నారు. ఆరో నోటిఫికేషన్‌లో గరుకుల డ్రాయింగ్‌ ఆర్ట్‌ 134 పోస్టులకు ఈనెల 24 నుంచి మే 24 వరకు, ఏడో నోటిఫికేషన్‌లో గురుకుల క్రాఫ్ట్‌ టీచర్‌ 92 పోస్టులకు, ఎనిమిదో నోటిఫికేషన్‌లో గురుకుల స్కూల్స్‌ మ్యూజిక్‌ టీచర్ల 124 పోస్టులకు కలిపి ఈనెల 24 నుంచి మే 24 వరకు దరఖా స్తులు ప్రక్రియ కొనసాగనుంది. అలాగే తోమ్మిదో నోటిఫికేషన్‌లో ట్రెయిన్డ్‌ గ్యాడ్యుయేట్‌ టీచర్‌ టీజీటీ 4020 పోస్టులకు ఈనెల 28 నుంచి మే 27వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అయితే జోనల్‌ వారీగా పోస్టులు, అర్హతలు, పరీక్ష తేదీలు ఈనెల 17, 24, 28వ తేదీల్లో వెలువడే ఆయా విభాగాల నోటిఫికేషన్స్‌లో పేర్కొననున్నారు.

గురుకులాల్లో ఇది మూడో నోటిఫికేషన్‌….
తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకులాల్లో ఇది మూడో నోటిఫికేషన్‌ 2016లో 12 వేల గురుకుల పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ పోస్టులను ప్రిలిమ్స్‌-1 పేపర్‌, మెయిన్స్‌-2 పేపర్‌ విధానంలో పరీక్షలు నిర్వహించారు. రెండోసారి 2018లో గురుకుల బోర్డు ద్వారా 4వేల పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఇందులో ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ కాకుండా మూడు పేపర్లతో పరీక్షలు నిర్వహించారు. టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు టెట్‌ పేపర్‌-2లో ఉత్తీర్ణత సాధించి వుండాలి.
వారం రోజుల్లో మరో 1000 పోస్టులతో నోటిఫికేషన్‌…
మొత్తం 13,675 పోస్టుల్లో గ్రూప్‌-3, గ్రూప్‌-4 పోస్టుల మినహా మిగతా 10,675 పోస్టుల భర్తీని ట్రిబ్‌ ద్వారా చేపట్టనున్నాయి. అం దులో తొలివిడతగా ప్రస్తుతం 9231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. మిగిలిన మరో వెయ్యి పస్టులకు సంబంధించి వారం పది రోజుల్లో నోటిఫికేషన్‌ వెలువడనుంది. అయితే ఈ పోస్టులకు సంబ ంధించి అందులో కొన్ని కొత్తగా, మెస్‌ ఇన్‌చార్జి, మరికొన్ని పోస్టులకు సర్వీస్‌ నిబంధనలు రూపొందించాల్సి ఉంది. అంతేకాకుండా న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాత దాదాపు మరో వారం రోజుల్లో మిగిలిన పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. గురుకులాల్లోని ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్స్‌ పోస్టులను మెడికల్‌ బోర్డు చేపట్టనుంది.

గురుకుల విద్యపై ప్రత్యేక దృష్టి….
రాష్ట్ర సర్కారు గురుకుల విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ఏర్పాటు నాటికి 123 గుకులాలు ఉండగా, వాటిని 1011లకు పెంచింది. అంతేకాకుండా పాఠశాల స్థాయి నుంచి ఇంటర్‌, డిగ్రీ స్థాయికి అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ క్రమంలోనే పోస్టులను దశలవారీగా భర్తీ చేసుకుంటూ పోతోంది. మూడేళ్ల క్రితమే ఆయా గురుకులాల్లో 10వేల పోస్టులను భర్తీ చేసింది. ఈసారి 9,231 పోస్టులను భర్తీ చేయనుంది. తొలుత 9,096 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే మరో 33 బీసీ గురుకులాలు, 15 డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేయగా అందుకనుగుణంగా పోస్టులను కూడా భర్తీ చేయాలని భావించింది. దీంతో మరో 3 వేల పోస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈక్రమంలో మొత్తంగా బోధన, బోధనేతర పోస్టులు 13,530 ఖాళీలుగా గుర్తించింది. ఈక్రమంలోనే ముందస్తుగా 9231 పోస్టులకు నోటిఫికేషన్‌ జారీ చేసి తర్వాత మరికొన్ని నోటిఫికేషన్లు జారీ చేయనుంది. ప్రభుత్వం భారీగా నోటిఫికేషన్‌ వేయడంతో ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement