Friday, November 22, 2024

ఏపీలోని అన్ని జిల్లాల ఆసుప‌త్రుల్లో హైప‌టైటిస్ కు వైద్యం

రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఆసుప‌త్రుల్లో హైప‌టైటిస్ కు వైద్యం అందించాల‌ని ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఏపీలో హెపటైటిస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని 11 బోధనాసుపత్రులు, 2 జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్ కు సంబంధించిన వ్యాధులకు స్క్రీనింగ్ తో పాటు వైద్యాన్ని అందిస్తున్నారు. ఇకపై అన్ని జిల్లా ఆసుపత్రుల్లో హెపటైటిస్ కు వైద్యం అందించాలని నిర్ణయించారు. దీంతో మొత్తం 26 ఆసుపత్రుల్లో హెపటైటిస్ బీ, సీ వ్యాధులకు గురైన వారికి వైద్యం అందనుంది. నిర్ధారిత కేసుల వివరాలను ఎప్పటికప్పుడు ‘నేషనల్ వైరల్ హెపటైటిస్ కంట్రోల్ ప్రోగ్రామ్ పోర్టల్’కు అనుసంధానం చేయ‌నున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement