Tuesday, November 26, 2024

411రోజుల పాటు కరోనాకి ట్రీట్మెంట్.. ప్రాణాలతో బయటపడిన వ్యక్తి

ఓ వ్యక్తి కరోనా నుంచి బయటపడటానికి సుదీర్ఘంగా మహమ్మారితో పోరాడి బతికి బయటపడ్డాడు..వివరాల్లోకి వెళ్లితే..బ్రిటన్ కు చెందిన 59 ఏళ్ల వ్యక్తికి 2020 డిసెంబర్ లో ఫస్ట్ వేవ్ లో కరోనా సోకింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు.ఏకంగా 411 రోజుల పాటు కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. పెర్సిస్టెంట్ కోవిడ్ ఇన్ఫెక్షన్ లాంగ్ కోవిడ్ కారణంగా ఆయన బాధపడ్డారు. వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించడం ద్వారా వ్యాధిని నయం చేశామని బ్రిటన్ పరిశోధకులు తెలిపారు. చనిపోతాడనుకున్న వ్యక్తిని బతికించామని చెప్పారు. కరోనా మహమ్మారి గత రెండున్నరేళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పుడిప్పుడే కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రభావం చూపుతోంది. కరోనా కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓ వ్యక్తి కరోనా నుంచి బయటపడటానికి సుదీర్ఘంగా మహమ్మారితో పోరాడాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement