Wednesday, November 20, 2024

COVID-19: ‘కొవాగ్జిన్‌’ తీసుకున్న అమెరికాలోకి ఎంట్రీ!

కరోనా టీకా ‘కొవాగ్జిన్’కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ఈ టీకా తీసుకున్న వారిని దేశంలోకి అనుమతిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. టీకా తీసుకున్న విదేశీయుల కోసం తాజాగా కొత్త ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసిన అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) కొవాగ్జిన్‌ను జాబితాలో చేర్చింది. ఈ నెల 8వ తేదీ నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల అత్యవసర వినియోగం నిమిత్తం కొవాగ్జిన్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అమెరికా తాజా నిర్ణయం తీసుకుంది. అమెరికాలో అడుగుపెట్టాక మాత్రం మోడెర్నా, లేదంటే ఫైజర్ టీకా వేయించుకోవడం తప్పనిసరి అని పేర్కొంది.

ఇది కూడా చదవండి: బీజేపీ కార్యాలయానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్

Advertisement

తాజా వార్తలు

Advertisement