తెలంగాణలో మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం ఇవ్వాల (శనివారం) బదిలీ చేసింది. 22 మంది కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీడీఎంఏ నుంచి జీహెచ్‌ఎంసీకి బీ. గీతను బదిలీ చేసింది. సీడీఎంఏ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా టీ మోహనకృష్ణ రెడ్డిని నియమించింది. బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్‌గా బీ సుమన్‌రావు, రామగుండం కార్పొరేషన్ కమిషనర్‌గా సీహెచ్ నాగేశ్వర్‌గా బదిలీ చేసింది.
ఇక.. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ.. తుర్కయాంజల్ కమిషనర్‌గా నియమించింది. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా కే నారాయణరావుగా బదిలీ చేయగా.. దమ్మాయిగూడ కమిషనర్ ఏ స్వామికి ఉద్యోన్నతి కల్పిస్తూ పాల్వంచ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. మిర్యాలగూడ కమిషనర్ పీ రవీంద్ర సాగర్‌కు ఉద్యోగోన్నతి కల్పిస్తూ ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బదిలీ చేసింది. జీ రాజేంద్ర కుమార్‌ను నగరం కమిషనర్‌గా, పోచారం అసిస్టెంట్ కమిషనర్ ఏ సురేష్‌ను జీహెచ్‌ఎంసీకి, ఎండీ సాబీర్ అలీని ఘట్కేర్‌సర్ కమిషనర్‌గా నియమించింది.
ఎంపీ పూర్ణచందర్‌రెడ్డిని మిర్యాలగూడ, ఎస్ రవీంద్రరెడ్డిని పెద్దఅంబర్‌పేట, బీ సత్యనారాయణరెడ్డిని ఖమ్మం, కే వేణుమాధవ్‌ను నందికొండ, పీ వేమన్‌రెడ్డిని పోచారం కమిషనర్‌గా బదిలీ చేసింది. ఆర్ త్రయంబకేశ్వర్‌ను రామగుండం డిప్యూటీ కమిషనర్‌గా, ఎస్ రాజమల్లయ్యను దమ్మాయిగూడ కమిషనర్‌గా నియమించింది. ఇబ్రహీంపట్నం కమిషనర్ మహ్మద్ యూసఫ్‌ను పదోన్నతిపై జీహెచ్‌ఎంసీకి పంపింది. ఆర్ రాజశేఖర్‌ను హుస్నాబాద్‌కు ఏ వెంకటేశ్‌ను కొత్తపల్లి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.