మల్టీ జోన్ వన్ పరిధిలో పనిచేస్తున్న 21 మంది ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ ఐ జి పి చంద్రశేఖర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. కాజీపేటలో పనిచేస్తున్న జి.మహేందర్ రెడ్డిని మందమర్రి సర్కిల్ కు, భూపాలపల్లి సిసిఎస్ లో పనిచేస్తున్న వాసుదేవరావును చెన్నూరుకు, చెన్నూరులో పనిచేస్తున్న ప్రవీణ్ కుమార్ ను శ్రీరాంపూర్ మహిళా పోలీస్ స్టేషన్ కు, నిజామాబాద్ ఎస్ బీ లో పనిచేస్తున్న శ్రీహరిని ఖానాపూర్ కు, కొత్తగూడెం డీఎస్పీలో పనిచేస్తున్న స్వామిని ఖమ్మం ఒకటవ పోలీస్ స్టేషన్ కు, కొత్తగూడెం ఒకటో పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న సత్యనారాయణను ఖమ్మం మూడవ పోలీస్ స్టేషన్ కు, భూపాలపల్లిలో పనిచేస్తున్న రాజిరెడ్డిని ఖమ్మం రూరల్ కు, కొత్తగూడెం డి సి ఆర్ బి లో పనిచేస్తున్న వేణుచందర్ ను చిట్యాల సర్కిల్ కు, మందమర్రిలో పనిచేస్తున్న ప్రమోదరావును గోదావరిఖని వన్ టౌన్ కు బదిలీ చేశారు.
అలాగే వరంగల్ విఆర్ లో ఉన్న రమేష్ ను మహబూబాబాద్ రూరల్ కు, మహబూబాబాద్ పిసిఆర్ లో పనిచేస్తున్న రవి రాజును వరంగల్ కమిషనరేట్ కు, మహబూబాబాద్ రూరల్ లో పనిచేస్తున్న రవికుమార్ ను మహబూబాబాద్ పిసిఆర్ కు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ బి లో పనిచేస్తున్న సర్వర్ ను ఐ జి పీ కార్యాలయానికి, గోదావరిఖని వన్ టౌన్ లో పనిచేస్తున్న రమేష్ బాబును రామగుండం ఎస్ బి3 కు, రామగుండం ఐటీలో పనిచేస్తున్న కర్ణాకర్ ను రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్ బి కి, వెయిటింగ్ లో ఉన్న రవీందర్ ను వరంగల్ కమిషనరేట్ కు, ఖానాపూర్ హవేలీలో పనిచేస్తున్న రామకృష్ణను ఐజిపి కార్యాలయానికి, ఖమ్మం ఒకటవ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న చిట్టిబాబు, ఖమ్మం మూడవ స్టేషన్ లో పనిచేస్తున్న సర్వయ్య, ఖమ్మం రూరల్ లో పని చేస్తున్న శ్రీనివాసును ఐజిపి కార్యాలయానికి, చిట్యాలలో పనిచేస్తున్న వెంకట్ ను భూపాలపల్లి సిసిఎస్ కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.