Monday, November 18, 2024

177మంది క‌శ్మీరీ పండిట్ టీచ‌ర్ల బ‌దిలీ – ప్ర‌భుత్వం ఆదేశాలు

శ్రీన‌గ‌ర్ లో విధులు నిర్వ‌హిస్తోన్న 177మంది క‌శ్మీరీ పండిట్ టీచ‌ర్ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు ట్రాన్స్ ఫ‌ర్ చేసింది ప్ర‌భుత్వం.
జమ్ము కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే టీచర్ల బదిలీ నిర్ణయం వెలువడటం గమనార్హం. 2012లో ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ కింద కశ్మీరీ పండిట్లకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. వారందరూ ఇప్పుడు తమను కశ్మీర్ లోయ నుంచి జమ్ము రీజియన్ లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు బదిలీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే.. మళ్లీ సామూహిక వలసలుగా వెళ్తామని హెచ్చరించారు.

ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షాలు కశ్మీరీ పండిట్లను బలిపశువులను చేస్తున్నారని విమర్శించారు. వారు తమ రాజకీయాల కోసం కశ్మీరీ పండిట్లను ఇంధనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. దమ్ముంటే వారు కశ్మీర్ వచ్చి సెక్యూరిటీ లేకుండా తిరగాలని సవాల్ విసిరారు. కశ్మీర్ పండిట్లు తీవ్ర అణచివేతను ఎదుర్కొంటున్నారని అన్నారు. కానీ, ఈ దేశం తమ బాధను చూస్తూ కూడా మౌనంగా ఉంటున్నదని ఆవేదన వ్యక్త పరిచారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు కశ్మీర్ పండిట్లపై పూర్తిగా భిన్న వైఖరిని ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ భట్ మరణం తర్వాత ఈ డిమాండ్ మరింత గట్టిగా వినిపిస్తున్నారు. భట్ మరణం తర్వాత సుమారు 6000 మంది ఉద్యోగులు కశ్మీర్ లోయలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు చేశారు. రాహుల్ భట్ హత్య తర్వాత ఉగ్రవాదుల దాడులు పెరుగుతూనే వచ్చాయి. మే 1వ తేదీ నుంచి లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు చంపేస్తున్నవారి సంఖ్య తొమ్మిదికి చేరింది. కశ్మీర్‌లోని ఓ బ్యాంకులో మేనేజర్‌గా చేస్తున్న రాజస్తాన్‌కు చెందిన విజయ్ కుమార్ హత్య ఎనిమిదవది. ఆయన తర్వాత ఓ ఇటుక బట్టిలో పని చేస్తున్న కార్మికుడినీ చంపేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement