శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో మహిళా పైలట్ కి గాయాలు అయ్యాయని అధికారులు వెల్లడించారు. మహారాష్ట్రలోని పుణే సమీపంలో కదబన్వాడీ వద్ద పంట పొలంలో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ విమానం పైలట్లకు శిక్షణ ఇచ్చే కార్వర్ ఏవియేషన్ కంపెనీకి చెందినదని పుణే ఎస్పీ అభినవ్ దేశ్‌ముఖ్ చెప్పారు. సాంకేతిక లోపం తలెత్తడంతో ట్రైనీ పైలట్ భవిక రాథోడ్ విమానాన్ని అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన పైలట్‌ను నవ్‌జీవన్ హాస్పిటల్‌కు తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement