అగ్నిపథ్ పథకంపై దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగుతున్న క్రమంలోనే.. ఆర్మీచీఫ్ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకంలో రిక్రూట్మెంట్ ఎప్పుడు చేపడుతారన్నది ఇంకా క్లారిటీ రానేలేదు కానీ, అగ్నివీరులకు ఈ ఏడాది డిసెంబర్‌లో శిక్షణ ప్రారంభిస్తామని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు.
శిక్షణ పొందిన సైనికులకు వచ్చే ఏడాది మధ్య నుంచి సర్వీసు ప్రారంభం అవుతుందన్నారు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్‌పాండే. కాగా, త్వరలోనే రిక్రూట్మెంట్ ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఇక .. తమ అధికారిక వెబ్‌సైట్‌లో మరొ రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని ఆయన తెలిపారు.
రిజిస్ట్రేషన్, ర్యాలీలకు సంబంధించిన వివరాలను తమ రిక్రూట్మెంట్ సంస్థలు వెల్లడిస్తాయన్నారు. మరోవైపు అగ్నిపథ్ స్కీమ్ కింద నియామకాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. బీహార్, తెలంగాణ, యూపీ రాష్ట్రాల్లో పలు రైళ్లకు ఆర్మీ విద్యార్థులు నిప్పుపెట్టారు.