Saturday, November 23, 2024

మహారాష్ట్ర నేతలకు శిక్షణా తరగతులు.. నాందేడ్ కు బయల్దేరిన కేసీఆర్

రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ నాందేడ్‌ బయలుదేరారు. మహారాష్ట్రలోని నాందేడ్‌లో బీఆర్‌ఎస్‌ పార్టీ తొలిసారిగా శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నది. రెండురోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. హైదరాబాద్‌ ప్రగతిభవన్‌ నుంచి బెంగంపేటకు చేరుకున్న ముఖ్యమంత్రి.. ప్రత్యేక విమానంలో నాందేడ్‌ బయలుదేరారు. మరికాసేటపట్లో మరఠ్వాడకు చేరుకోనున్నారు. శిక్షణ శిబిరం నిర్వహించే అనంత్‌లాన్స్‌ వేదిక మొత్తం గులాబీ మయమైంది.

నాందేడ్‌ వ్యాప్తంగా కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌, దేశ్‌ కీ నేత కైసే హో కేసీఆర్‌ జైసే హో.. దేశ్‌ కీ నేత కేసీఆర్‌ వంటి నినాదాలతో ఫ్లెక్సీలు ఆకర్షిస్తున్నాయి. నాందేడ్‌ విమానాశ్రయం నుంచి అనంత్‌లాన్స్‌ మార్గంతోపాటు రైల్వేస్టేషన్‌ సహా ప్రధాన కూడళ్లలో గులాబీ ఫ్లెక్సీలు సందడి చేస్తున్నాయి. కాగా, మహారాష్ట్రలోని మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు శిక్షణా శిబిరాలకు తరలివచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement