Friday, November 22, 2024

Trai: వినియోగదారులకు ఊరట.. ఇకపై రీచార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 30 రోజులు!

మొబైల్ ఫోన్ వినియోగదారుల ప్రీపెయిడ్ ప్యాక్ వ్యాలిడిటీ విషయంలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ మరో సరికొత్త నిబంధన తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో ఉండాలని ఆదేశించింది. గతంలో ప్రీపెయిడ్ ప్యాక్‌లు 30 రోజుల కాలపరిమితితో లభ్యమయ్యేవి. అయితే, ఆ తర్వాత వీటిని అన్ని టెలికం సంస్థలు 28 రోజులకు తగ్గించేశాయి. ఫలితంగా సంవత్సరానికి 13 సార్లు రీచార్జ్ చేసుకోవాల్సి వస్తోంది. వినియోగదారులకు ఇది భారంగా మారుతోంది.

ఈ నేపథ్యంలో ఇకపై ప్రతి సంస్థ 30 రోజుల కాలపరిమితితో ప్రీపెయిడ్ రీచార్జ్ ప్యాక్‌‌లను తీసుకురావాలని ఆదేశించింది. ఇందులో ప్లాన్ ఓచర్, ఒక స్పెషల్ టారిఫ్ ఓచర్, కాంబో వోచర్‌లు ఉండాలని స్పష్టం చేసింది. ప్రతి నెల ఒకే తేదీన వీటిని రీచార్జ్ చేసుకుంటే సరిపోయేలా ఉండాలని ఆదేశించింది. అంతేకాదు, రెండు నెలల్లోపు తమ ఆదేశాలను అమలు చేయాలని ఆదేశించింది.

ట్రాయ్ జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులకు కచ్చితంగా 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్ అందించాల్సి ఉంటుంది.  ట్రాయ్ కొత్త నిర్ణయం మొబైల్ ఫోన్ వినియోగదారులకు ఊరట కల్గిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement