Friday, November 22, 2024

Breaking: రెండేళ్ల బాలుడిని చంపి.. తల్లి ఆత్మహత్య

తన కుమారుడైన రెండేళ్ల బాలుడిని చంపి.. ఆ తర్వాత తల్లి ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని నగర్ వినాయక నగర్ లో చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక రెండేళ్ల బాలుడికి ఉరేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఫిల్మ్ నగర్ లో విశ్వనాథ్, శిరీష నివాసం ఉంటున్నారు. వీరికి రెండున్నర ఏళ్ల బాలుడు మనీష్ ఉన్నాడు.

అయితే.. అత్తింటి వేధింపులు భరించలేక కుమారుడు మనీష్ కి ఉరివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది శిరీష. ప్రస్తుతం శిరీష మూడు నెలల గర్భిణి అని తెలిపారు పోలీసులు. ఇక మృత దేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఫిల్మ్ నగర్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement