Tuesday, November 26, 2024

పెండింగ్ చలానాలు చెల్లించని వారిపై కేసులు

పెండింగ్ చలానాపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు సిద్ధమవుతున్నారు. కోట్లలో పెరుగుపోయిన పెండింగ్ చలానాల కోసం పోలీసులు భారీ రాయితీ ప్రకటించారు. దీనికి విశేష స్పందన వచ్చింది. వాహనాల పెండింగ్‌ చలానాల చెల్లింపునకు ప్రకటించిన రాయితీ గడువు ముగిసినా మరో 30శాతం మంది చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నెలన్నరపాటు సాగిన ప్రత్యేక రాయితీ ద్వారా 3 కోట్లకు పైగా చలానాలు క్లియర్‌ అయ్యాయి. 65 శాతం కార్ల యజమానులు, 70 శాతానికి పైగా ద్విచక్ర వాహనదారులు పెండింగ్‌ చలానాలు చెల్లించారు. దీంతో రూ.1700 కోట్ల పెండింగ్‌ చలానాల్లో రూ. 1004 కోట్లు వసూలు అయ్యాయి. అయితే, రాయితీ ముగిసిన తర్వాత కూడా ఇంకా 30శాతం మంది వాహనదారులు చలానాలు చెల్లించకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. దీంతో ఆయా వాహనాలపై పోలీసులు దృష్టి సారించారు. ఆయా వాహనాలను గుర్తించి రాయితీ లేకుండానే చలానాలు వసూలు చేయనున్నారు. అంతేకాకుండా వాహనదారులపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement