రేపు (ఆదివారం) సాయంత్రం 5 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ బహిరంగ సభ జరగనుంది. దీనికి ప్రధాని మోదీతో పాటు పలువురు బీజేపీ లీడర్లు హాజరుకానున్నారు. మోదీ రాక నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పరేడ్ గ్రౌండ్స్ తో పాటు ఆ చుట్టుపక్కల పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. ఇక.. హెచ్ఐసీసీ మాదాపూర్ – జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు – కేబీఆర్ పార్క్ – పంజాగుట్ట – గ్రీన్ ల్యాండ్స్ – బేగంపేట – పరేడ్ గ్రౌండ్స్ రహదారిపై ఆంక్షలు ఉంటాయన్నారు. టివోలి క్రాస్ రోడ్స్ – ప్లాజా క్రాస్ రోడ్స్ దారి కూడా మూసివేయనున్నట్లు తెలిపారు.
చిలకలగూడ క్రాస్ రోడ్స్, అలుగడ్డ బాయి క్రాస్ రోడ్స్, సంగీత్ క్రాస్ రోడ్స్, వైఎంసీఏ క్రాస్ రోడ్స్, ప్యాట్నీ క్రాస్‌రోడ్స్, ఎస్‌బీహెచ్ క్రాస్‌రోడ్స్, ప్లాజా, సీటీవో జంక్షన్, బ్రూక్‌బాండ్ జంక్షన్, టివోలి జంక్షన్, త్రైక్‌బాండ్ జంక్షన్, స్వీక్ క్లబ్‌లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుందన్నారు. డైమండ్ పాయింట్, బోయిన్‌పల్లి క్రాస్‌రోడ్స్, రసూల్‌పురా, బేగంపేట్, ప్యారడైజ్ ఏరియాల్లోనూ ట్రాఫిక్ ఉండే అవకాశం ఉందన్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్‌కు మూడు కిలోమీటర్ల పరిధిలోని అన్ని జంక్షన్‌లు, రోడ్ల వైపు రాకుండా ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంజి రోడ్, ఆర్‌పి రోడ్, ఎస్‌డి రోడ్ల వైపు కూడా రావొద్దని పోలీసులు కోరారు.