ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఫేక్ స్టిక్కర్లు వేసుకొని రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. సామాన్య ప్రజలు, సెలిబ్రిటీలు, రాజకీయ నాయకులకు సంబంధించిన వాహనాలను కూడా వదలడం లేదు. కార్లకు నకిలీ స్టిక్కర్లు, ఎమ్మెల్యే స్టిక్కర్లు, బ్లాక్ ఫిల్ములతో తిరుగుతున్న వారిని గుర్తించి వారికి చలానాలు విధిస్తున్నారు.
ఈ క్రమంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌కు చెందిన కారుకు బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో వాహనాన్ని ఆపి దాన్ని తొలగించారు. ఈ సమయంలో డ్రైవర్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు, మరొకరు ఉన్నట్లు తెలిసింది. అలాగే ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పేరుతో ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్, ఎంఐఎం ఎమ్మెల్యే మేరాజ్ హుస్సేన్, ఆంధ్రప్రదేశ్‌లో పుట్టపర్తి ఎమ్మెల్యే దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి పేరుతో ఉన్న వాహనాలపై ఉన్న స్టిక్కర్లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి తొలగించారు. ఈ క్రమంలోనే నంబరు ప్లేటు సరిగా లేని వాహనాలకు చలాన్లు విధించారు. 90 వాహనాలపై కేసులు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.