Friday, November 22, 2024

ట్రాఫిక్ చ‌లాన్ల డిస్కౌంట్ గ‌డువు – నేటితో ఆఖ‌రు

ట్రాఫిక్ చ‌లాన్ల డిస్కౌంట్ గ‌డువు నేటితో ముగియ‌నుంది. కాగా ఈ ఆఫ‌ర్ ని మార్చి 1న ప్రారంభించింది తెలంగాణ స‌ర్కార్. మార్చి 31వ‌రకు గ‌డువు ముగిసినా..వాహ‌న‌దారుల విజ్ఞ‌ప్తుల మేర‌కు ఆ గ‌డువును ఏప్రిల్ 15 వ‌ర‌కు పొడిగించారు. ఇక ఏప్రిల్ 15 చివ‌రి తేదీ, మ‌ళ్లీ గ‌డువు పొడించ‌బోమ‌ని ట్రాఫిక్ పోలీసులు స్ప‌ష్టం చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు 3 కోట్ల పెండింగ్ చ‌లాన్లు క్లియ‌ర్ అయ్యాయి. పెండింగ్ చ‌లాన్ల క్లియ‌రెన్స్‌తో ప్ర‌భుత్వానికి రూ. 300 కోట్ల ఆదాయం స‌మ‌కూరింది. 65 శాతం పైగా పెండింగ్ చ‌లాన్ల‌ను వాహ‌న‌దారులు క్లియ‌ర్ చేశారు.ద్విచక్ర, త్రిచక్ర వాహనాలకు, తోపుడు బండ్ల వారికి పెండింగ్‌ చలాన్‌ మొత్తంలో 25 శాతం చెల్లిస్తే..75 శాతం మాఫీ చేస్తామని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ డ్రైవర్లకు 30శాతం, కార్లకు, ఇతర వాహనాలకు (లైట్‌మోటార్‌ వెహికిల్స్‌, హెవీ మోటార్‌ వెహికిల్స్‌కు) 50 శాతం చెల్లిస్తే చాలని తెలిపారు. మాస్క్‌లు లేని కేసులలో విధించిన చలాన్లలో రూ.100 చెల్లిస్తే రూ.900 మాఫీ అవుతుందన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement