Tuesday, November 26, 2024

దొరికిన చీతా.. కునో పార్క్‌లో విడిచిపెట్టిన అధికారులు

ఎట్ట‌కేల‌కు న‌మీబియ‌న్ చీతా ఒబాన్ జాడ తెలిసింది. ఈ నెల 2న పార్క్ నుంచి ఒబాన్ తప్పించుకుని వెళ్లిపోయింది. ఆ తర్వాత దానిని కునో నేషనల్ పార్క్‌కు 20 కిలోమీటర్ల దూరంలో విజయ్‌పూర్‌లోని జార్ బరోడా గ్రామంలో గుర్తించారు. ఆ తర్వాతి రోజు అది పార్వతి బరోడా గ్రామంలో ఓ నదిలో నీళ్లు తాగుతూ కనిపించింది. కాగా అది తనంత తానుగానే పార్క్ సరిహద్దుల వద్దకు చేరుకుంది.అయితే, పార్క్‌లోకి రావాల్సిన చీతా నహద్-సిల్పురా ప్రాంతంలోని బఫర్‌ జోన్‌లోకి వెళ్లిపోయింది. అక్కడి నుంచి అది పోహ్రి తహసీల్‌లోని పిపార్వాస్ అడవిలోకి ప్రవేశించి అక్కడే రెండు రోజులపాటు ఉండిపోయింది. ఒబాన్ ఓ కృష్ణ జింకను వేటాడి ఆకలి తీర్చుకుంది. రాంపూర్ గ్రామంలో కనిపించిన ఒబాన్‌కు మత్తుమందు ఇచ్చి, ఆపై క్షేమంగా పట్టుకుని కునో పార్క్‌లో విడిచిపెట్టారు. మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకుపోయిన నమీబియన్ చీతా ‘ఒబాన్’ను అధికారులు పట్టుకుని తిరిగి పార్క్‌లో వదిలిపెట్టారు. తప్పించుకుపోయిన చీతా జాడ ఐదు రోజులైనా లేకపోవడంతో రంగంలోకి దిగిన అటవీ అధికారులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. శివపురి జిల్లాలోని ఓ గ్రామంలో అది వారి కంట పడడంతో బంధించి పార్క్‌కు తీసుకొచ్చి వదిలిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement