హుజురాబాద్ ఉప ఎన్నికపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. హుజురాబాద్ కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డిని పార్టీ నుండి బహిష్కరించిన నేపథ్యంలో అక్కడ పార్టీని నిలబెట్టడటంతో పాటు మండలాల వారీగా ప్రచారం కోసం ఇంచార్జ్ లను నియమించారు. ఎన్నికల కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ గా నియమించారు.
నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్తలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం వ్యవహరించనున్నారు.
మండలాల వారీగా ఇంచార్జ్ లు వీరే-
వీణవంక మండలం
ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్..
జమ్మికుంట మండలం
విజయ రమణ రావ్, రాజ్ ఠాకూర్
హుజురాబాద్ మండలం
టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్..
హుజురాబాద్ టౌన్
బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు
ఇల్లంతకుంట మండలం
నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కమలపూర్ మండలం
కొండా సురేఖ, దొమ్మాటి సాంబయ్య
కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త
కవ్వంపల్లి సత్యనారాయణ