తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. రేవంత్ రెడ్డి ఇంటివద్ద భారీగా పోలీసులను మోహరించారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీపై అస్సోం సీఎం హేమంత్ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నేడు ఎస్పీ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్ ముందు ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ధర్నాకు వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ధర్నాకు వెళ్లకుండా రేవంత్‌రెడ్డిని ఇంటి వద్దే అడ్డుకున్నారు.
అసోం సీఎంపై కేసులు నమోదు చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ధర్నాలు చేస్తున్నారు. అసోం సీఎంపై కేసులు నమోదు చేయనందుకు నిరసనగా కాంగ్రెస్ ధర్నాలు చేస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ దగ్గర ధర్నాలో పాల్గొంటున్నట్లు నిన్న రేవంత్‌రెడ్డి ప్రకటించారు.