కాంగ్రెస్ పాలనలో దేశం ప్రపంచ దేశాల ముందు ఒక శక్తివంతమైన దేశంగా నిలబడిందని తెలంగాణ పీసీసీ అభ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చి స్వేచ్ఛ వాయువులని ఇచ్చిందన్నారు. మోదీ పాలనలో దేశాన్ని అదానీ, అంబానీలకు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. వ్యవసాయ నల్ల చట్టాలను మోదీ తీసుకొచ్చి దేశంలో రైతుల నడ్డి విరుస్తున్నారన్నారు. పెట్రో ధరలు పెంచుతూ మోదీ సర్కార్ దేశంలో సామాన్యుల నడ్డి విరుస్తోందని రేవంత్ పేర్కొన్నారు. తెల్లదొరల ఫాసిస్ట్ విధానాలని దేశంలో నరేంద్ర మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్ అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ కేసీఆర్‌ల ఫాసిస్ట్ విధానాలని వ్యతిరేకించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడిపై ఉందన్నారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల ఆశయాలు నెరవేరాలని సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. కేసీఆర్ పాలనలో బలహీన వర్గాల ఆశయాలు అమలు కావడం లేదన్నారు. దేశంలో మోదీ.. రాష్ట్రంలో కేసీఆర్ గద్ద దిగితేనే సామాన్య ప్రజలకు మేలు జరుగుతుందని రేవంత్ పేర్కొన్నారు.
ఇది కూడా చడవండి: హుజురాబాద్ కు రూ.500 కోట్లు.. దళిత బంధు నిధులు విడుదల