Tuesday, November 19, 2024

‘చలో రాజ్‌భవన్‌’లో ఉద్రిక్తత.. పోలీసులను వదలం: రేవంత్

పెట్రోల్, డీజిల్‌ ధరల పెరుగుద‌ల‌ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఇందిరా పార్క్ వద్దకు వచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందిరా పార్క్ వద్ద జరిగిన సమావేశంలో ప్రసంగించిన రేవంత్ రెడ్డి.. కార్యకర్తలతో కలిసి రాజ్ భవన్ వైపు పాదయాత్రగా బయలుదేరారు. ఇదే సమయంలో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి అక్కడినుంచి తీసుకెళ్లారు.

రేవంత్ ను అరెస్ట్ చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులకు కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. రేవంత్ అరెస్ట్ ను ఖండిస్తూ కాంగ్రెస్ కార్యాకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొందరు రేవంత్ తీసుకెళ్తున్న వాహనం వెంట వెళ్లారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు మరికొందరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. జిల్లాల్లోనూ చాలా మంది కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టులు చేశారు.

కాంగ్రెస్ నాయకులను బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారని టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ రకమైన అరెస్టులు చేసి పోలీసులతో పరిపాలన చేయాలని సీఎం కేసీఆర్ అనుకుంటే తీవ్రమైన పరిణామలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అధికారులు సీఎం ప్రైవేటు సైన్యంలా వ్యవహరిస్తే.. ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాము చేస్తున్న కార్యక్రమం ప్రజల కోసమని చెప్పారు. 40 రూపాయల పెట్రోల్‌కు 65 రూపాయల పన్ను వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి: కృష్ణా, గోదావరి బోర్డుల గెజిట్‌పై డైలాగ్ వార్

Advertisement

తాజా వార్తలు

Advertisement