తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరింత దూకుడు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నేటి నుంచి 48 గంటల పాటు దీక్షకు దిగారు. మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని దళిత, గిరిజన కుటుంబాలన్నింటికీ దళితబంధు పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్షకు దిగారు. నేటి నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ దళిత, గిరిజన నేతలు దీక్షలో కూర్చున్నారు. ముఖ్య నేతలు, వేలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
కాగా, ఇప్పటికే దళిత, గిరిజన ఆత్మగౌవర దండోరా పేరుతో ఇంద్రవెల్లి, రావిర్యాలలో సభలు నిర్వహించారు. ఇవి విజయవంతం కావడంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని దళిత, గిరిజన వర్గాలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలనే డిమాండ్‌తో రేవంత్‌రెడ్డి 48 గంటల దీక్షా చేస్తున్నారు. రేపు సాయంత్రం 5గంటలకు టీపీసీసీ చీఫ్ దీక్షను విరమించనునున్నారు.