Tuesday, November 26, 2024

పీసీసీ పంచాయితీ.. టీ.కాంగ్రెస్ లో నేతల లొల్లి!

తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ పదవి చిచ్చు రాజేసింది. పీసీసీ అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో సీనియర్ నాయకులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. రేవంత్ పేరు అధికారికంగా ప్రకటించికపోయినా… ఆయననే ఫిక్స్ చేసినట్లు పార్టీ హైకమాండ్ సంకేతాలు ఇచ్చింది. దీంతో పదవిపై ఆశలు పెట్టుకున్న నేతలు ప్లాన్ బీ అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. రేవంత్ కు పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని వీడుతామని హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా సీనియర్ నేత వీహెచ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తదితరులు పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.

నిజానికి పీసీసీ పదవిపై రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి సహా అనేక మంది ఆశలు పెట్టుకున్నారు. దాదాపు రెండేళ్లుగా కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయలేదు. పదవికి రాజీనామా చేసిన ఉత్తమ్ నే ఇంకా కొనసాగిస్తున్నారు. పార్టీలో అభిప్రాయాలు సేకరణ, నేతలతో చర్చలు జరిపి అనంతరం నూతన సారథిని ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయితే, పేరును మాత్రం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. దీంతో పీసీసీ పదవి పార్టీలో వేడి పెంచుతోంది. పీసీసీ నియామకంపై హైకమాండ్ తీసుకునే నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జగ్గారెడ్డి సహా పలువురు పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పార్టీలోనే కొనసాగితే.. ఈ సీనియర్ నాయకులు కొత్త అధ్యక్షుడికి సహకరిస్తారా? లేదా అన్నది ఉత్కంఠగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement