Friday, November 22, 2024

పెరూలో కూలిన ప‌ర్యాట‌కుల విమానం : ఏడుగురు మృతి

ఓ ప‌ర్యాట‌క విమానం కూలి ఏడుగురు ప‌ర్యాట‌కులు మృతిచెందిన విషాద ఘ‌ట‌న పెరూలో చోటుచేసుకుంది. పెరూలో ఎడారిలో పర్యాటక స్థలాన్ని సందర్శించటానికి వెళ్లుతున్న విమానం నాజ్కాలో లో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానం ప్రమాదం గురించి పెరూ రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్​, కోఫైలట్ ఉన్నట్లు తెలిపారు. పర్యాటకుల్లో ముగ్గురు డచ్ టూరిస్టులు, ఇద్దరు చిలీకి చెందినవారున్నారని అధికారులు తెలిపారు.

పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా.. నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో సెన్నా 207 విమానం కూలిపోయింది. ఆ విమానం ఏరో శాంటోస్‌ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు. పెరూలో నాజ్కా లైన్లు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 1,500-2,000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్మక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement