ఓ పర్యాటక విమానం కూలి ఏడుగురు పర్యాటకులు మృతిచెందిన విషాద ఘటన పెరూలో చోటుచేసుకుంది. పెరూలో ఎడారిలో పర్యాటక స్థలాన్ని సందర్శించటానికి వెళ్లుతున్న విమానం నాజ్కాలో లో టేకాఫ్ అయిన కొద్దిసేటికే విమానం కుప్పకూలిపోయింది. ఈ విమానం ప్రమాదం గురించి పెరూ రవాణా, కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఐదుగురు పర్యాటకులు, ఫైలట్, కోఫైలట్ ఉన్నట్లు తెలిపారు. పర్యాటకుల్లో ముగ్గురు డచ్ టూరిస్టులు, ఇద్దరు చిలీకి చెందినవారున్నారని అధికారులు తెలిపారు.
పెరువియన్ ఎడారిలోని నాజ్కా లైన్ల పర్యటన కోసం సందర్శకులను తీసుకువెళ్తుండగా.. నాజ్కాలోని వైమానికి కేంద్రానికి సమీపంలో సెన్నా 207 విమానం కూలిపోయింది. ఆ విమానం ఏరో శాంటోస్ అనే పర్యాటక సంస్థకు చెందినదిగా గుర్తించారు. పెరూలో నాజ్కా లైన్లు ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం. 1,500-2,000 సంవత్సరాల క్రితం తీరప్రాంత ఎడారి ఉపరితలంపై గీసిన ఊహాత్మక బొమ్మలు, జీవులు, మొక్కల చిత్రాలే నాజ్కా లైన్లు. దీనిని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..