Friday, November 22, 2024

యాత్రా స్థలాలుగా అండమాన్ నికోబార్ దీవులు.. స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీకి అన్యాయం

అండమాన్ నికోబార్ దీవులను స్వాతంత్య్రానికి సంబంధించిన యాత్రా స్థలాలుగా భావించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. యువత తమ జీవితంలో కనీసం ఒకసారి అండమాన్ నికోబార్ సందర్శించాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ దీవిలో పర్యటన సందర్భంగా అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 

పోర్ట్‌‌‌‌ బ్లెయిర్: స్వాతంత్ర్య పోరాటంలో నేతాజీ సుభాష్‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌ చేసిన కృషికి తగ్గ గుర్తింపు దక్కలేదని, ఆయనకు అన్యాయం జరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌ షా అన్నారు. అండమాన్‌‌‌‌, నికోబార్‌‌‌‌‌‌‌‌లోని రాస్‌‌‌‌ ఐల్యాండ్‌‌‌‌ పేరును నేతాజీ సుభాష్‌‌‌‌ చంద్రబోస్‌‌‌‌ ఐల్యాండ్‌‌‌‌గా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో షా మాట్లాడుతూ.. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వ్యక్తులకు చరిత్రలో స్థానం కల్పించాలని, అందుకోసమే ఈ ద్వీపానికి నేతాజీ పేరు పెట్టామని చెప్పారు. అండమాన్‌‌‌‌, నికోబార్‌‌‌‌‌‌‌‌ దీవులు స్వాతంత్ర్య పుణ్యక్షేత్రం అని అన్నారు. యువకులు ఒక్కసారైనా ఈ దీవులను సందర్శించాలన్నారు. వీర్‌‌‌‌‌‌‌‌ సావర్కర్‌‌‌‌‌‌‌‌కు ‘వీర్‌‌‌‌‌‌‌‌’అనే బిరుదును ప్రభుత్వం ఇవ్వలేదని, ఆయన పరాక్రమం, దేశ భక్తిని గుర్తించి కోట్ల మంది ప్రజలు ఈ బిరుదు ఇచ్చారన్నారు. ఈ రోజు కొంతమంది సావర్కర్‌‌‌‌‌‌‌‌ దేశ భక్తిని ప్రశ్నిస్తున్నారని, ఇది చాలా బాధాకరమన్నారు. అండమాన్‌‌‌‌, నికోబార్‌‌‌‌‌‌‌‌ ప్రజలు ఎదుర్కొంటున్న కనెక్టివిటీ సమస్యను పరిష్కరించడానికి ప్రధాని మోడీ 2018లో ఆప్టికల్‌‌‌‌ ఫైబర్‌‌‌‌‌‌‌‌ పథకానికి పునాది వేశారని, దీన్ని తాను 2020 ప్రారంభించినట్లు అమిత్‌‌‌‌ షా గుర్తు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement