బాలీవుడ్ నుంచి మరో రికార్డును అందుకుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం. ఈ సినిమా హిందీ వెర్షన్ కి మొదటి రోజు నుంచీ మంచి ఆదరణ లభిస్తోంది. సాధారణంగా హిందీలో 100 కోట్ల మార్కును టచ్ చేయడమే గొప్పగా భావిస్తుంటారు. కానీ ‘ఆర్ ఆర్ ఆర్’ 200 కోట్ల మార్క్ ను టచ్ చేసి అక్కడి స్టార్ హీరోలు .. దర్శక నిర్మాతలు ఆశ్చర్యపోయేలా చేసింది. లాంగ్ రన్ లో ఈ సినిమా అక్కడ 300 కోట్ల వసూళ్లను రాబట్టవచ్చనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దర్శకుడు రాజమౌళి ఆశించిన స్థాయి సపోర్ట్ లభించకపోయినప్పటికీ, వసూళ్ల విషయంలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో నిడివి తక్కువే అయినా అలియా భట్ నటించడం .. అజయ్ దేవగణ్ పాత్ర హైలైట్ కావడం బాలీవుడ్ వసూళ్లకు కొంతవరకూ కలిసొచ్చింది. ఈ సినిమాకి సీక్వెల్ ఉందని విజయేంద్రప్రసాద్ చెబుతుండటం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement