మీకు నచ్చని వ్యక్తులు ఎవరైనా ఉంటే వారి పేరుని ఈ బొద్దింకకి పెట్టొచ్చు. వినడానికి వింతగానే అనిపించినా.. ఇది నిజమే. కెనాడాలోని టొరంటో వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఒక వినూత్నమైన ప్రచార కార్యక్రమాన్ని చేపట్టింది. మాజీ లవర్ లేదా బాస్ లేదా బంధువు ..మరెవరి పట్ల అయినా అసంతృప్తితో ఉంటే, వారి పేరును బొద్దింకకు పెట్టి ఊరట పొందండని పిలుపునిచ్చింది.
25 డాలర్లు (రూ.2,050) చెల్లించడం ద్వారా బొద్దింకకు పేరు పెట్టొచ్చట.పేరు పెట్టాలనుకునే వారు రూ.2050 చెల్లించి క్యాంపెయిన్ లో పాల్గొనవచ్చు. అనంతరం బొద్దింకకు ఆ పేరు పెట్టినట్టు డిజిటల్ సర్టిఫికెట్, చందా ముట్టినట్టు రసీదును వన్యప్రాణుల అభయారణ్యం పంపిస్తుంది. టొరంటో జూ వైల్డ్ లైఫ్ కన్జర్వెన్సీ ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టింది. మీ జీవితంలో ఎవరైనా మిమ్మల్ని తొలుస్తున్నారా.. ఈ వేలంటైన్స్ డే సందర్భంగా వారి గౌరవార్థం వారి పేరును బొద్దింకకు పెట్టి, రోమాలు నిక్కబొడుచుకునేలా చేయండి అని ట్వీట్ లో పేర్కొంది. గొప్ప ఐడియా.. టాప్ 10 పేర్లను మాకు తెలియజేయాలంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఎంత మంది పేర్లను పెడతారో చూద్దామంటూ మరో యువతి కామెంట్ చేసింది.
మీకు నచ్చని వారి పేరుని.. ఈ బొద్దింకకి పెట్టొచ్చు
Advertisement
తాజా వార్తలు
Advertisement