Saturday, November 23, 2024

Top story : ఊరంతా మ‌రుగుజ్జులే..ఎక్క‌డో తెలుసా..

మ‌నుషుల‌న్నాక పొట్టిగా ఒక‌రు..పొడ‌వుగా మ‌రొక‌రు ఉండ‌టం స‌హ‌జ‌మే..పొట్టిని మించి మ‌రింత పొట్టిగా ఉంటే వారిని మ‌రుగుజ్జువార‌ని పిలుస్తుంటాం. అలాంటి మ‌రుగుజ్జు వారు ఎక్క‌డో చోట క‌నిపిస్తూనే ఉంటారు..ఒక‌రు ఇద్ద‌రిని చూస్తేనే మ‌నం విచిత్రంగా చూస్తుంటాం. మ‌రి ఊరు ఊరంతా మ‌రుగుజ్జులే ఉంటే..అలా ఉంటారా అని అనుకోకండి..నిజంగానే ఉన్నారు. మ‌రి వివరాలు చూద్దామా.. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్‌లో ఉంది ఆ ఊరు. దాని పేరు యాంగ్సి. ఆ ఊరిలో ఉన్న వాళ్ల‌లో స‌గం మంది మ‌రుగుజ్జులే. అస‌లు.. ఆ ఊరిలో అంత‌మంది ఎలా మ‌రుగుజ్జులు ఎలా అయ్యారో ఎవ్వ‌రికీ అంతుప‌ట్ట‌డం లేదు. ఆ ఊళ్లో ఉన్న‌ మ‌రుగుజ్జుల్లో ఎక్కువ హైటే 3 ఫీట్లా 10 ఇంచులు. త‌క్కువ హైట్ 2 ఫీట్లా ఒక ఇంచ్‌.ఒక‌వేళ ఆ ఊరి ప్ర‌జ‌లు తినే ఆహారం, ఆ ఊరు నీళ్లు, ప్రాంతం, నేల స్వ‌భావం.. ఇలా వీటిలో దేనివ‌ల్ల అయినా వాళ్లు మ‌రుగుజ్జులు అయ్యారేమో అని సైంటిస్టులు ఎన్నో టెస్టులు చేసిన‌ప్ప‌టికీ అస‌లు ర‌హ‌స్యం మాత్రం క‌నుక్కోలేక‌పోయారు.

అయితే.. ఆ ఊరికి చెందిన ఓ పెద్ద‌మ‌నిషి చెప్పిన వివ‌రాలు చూస్తే .. వేసవికాలంలో ఓ రోజు అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఒక మాయ‌దారి రోగం ఊరిలోని చిన్న పిల్ల‌ల‌కు సోకింది. అది కూడా 5 నుంచి 7 సంవ‌త్స‌రాలు ఉన్న పిల్ల‌ల‌కే సోకింది. అప్ప‌టి నుంచి ఆ పిల్ల‌ల్లో ఎదుగుద‌ల ఆగిపోయింది. వాళ్ల‌లో కొంద‌రికి కాళ్లు చేతులు ప‌డిపోయాయి. విక‌లాంగులుగా మారిపోయారు.. అని తెలిపారు. అయితే.. 1997లో మ‌రో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఆ ఊరిలోని నేల‌లో మెర్క్యూరీ సాంద్ర‌త పెర‌గ‌డం వ‌ల్ల అక్క‌డి ప్ర‌జ‌ల్లో పెరుగుద‌ల ఆగిపోయింది అనే విష‌యం కూడా ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అయితే లేదు.. జ‌పాన్‌.. చైనాలో విష‌పు గ్యాస్‌ను వ‌దిలిన‌ప్పుడు.. ఆ విష‌పు గ్యాస్‌.. ఈ ఊరిలోకి వ్యాపించింది. అందుకే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు ఎత్తు పెర‌గ‌లేదు అంటూ మ‌రో వాద‌న కూడా తెర‌మీదికి వ‌చ్చింది. ఇలా ఆ ఊరి మ‌రుగుజ్జుల మీద ప‌లు ర‌కాల వాద‌న‌లు తెర మీదికి వ‌స్తున్న‌ప్ప‌ట‌కి… అస‌లు ర‌హ‌స్యాన్ని మాత్రం ఎవ్వ‌రూ క‌నుక్కోలేక‌పోయారు..ఇప్ప‌టికీ ఈ విష‌యం మిస్ట‌రీగా మిగిలింది.

మరుగుజ్జు తనం కలగడానికి చాలా వైవిధ్యమైన కారణాలున్నాయి. కానీ అకాండ్రోప్లేసియా, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేవి దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించడం జరిగింది.మరుగుజ్జులుగా జన్మించేవారు జన్యులోపాలతో పుట్టడం వ‌ల్ల దీన్ని ముందుగానే నివారించడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. మరుగుజ్జు తనాన్ని కలుగజేసే అనేక కారణాల్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి ఉండటం వ‌ల్ల ఒక శిశువు మరుగుజ్జుగా జన్మిస్తాడనేది కచ్చితంగా చెప్పలేము. అయితే దీన్ని కలుగజేసే పోషకాహార లేమి, హార్మోన్ల సమతుల్యతలోలో లోపం మొదలైన కారణాలను సరైన ఆహార పద్ధతుల ద్వారా, హార్మోన్ థెరపీ ద్వారా కొంత వరకు నివారించవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement