Thursday, September 19, 2024

Top Story – వానాకాలం వ‌స్తే గ‌ల గ‌ల‌ల‌ స‌వ్వ‌డులు – టూరిస్టుల సందడిలే

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, ఉమ్మ‌డి ఆదిలాబాద్ : వానాకాలంలో జలపాతాల అందాల‌ను ఆస్వాదించేందుకు ప‌ర్యాట‌కులు త‌ర‌లి వ‌స్తుంటారు. గలగల పారే జలపాతాల సవ్వడుల‌ను తనివి తీరా ఆస్వాదిస్తూ మైమరిచిపోతుంటారు. ఆదిలాబాద్ జిల్లాలోని 85 కిలో మీటర్ల పొడవునా ఆగ్నేయ దిశలో ప్రవహించే కడెం నది పర్యాటకులను కట్టిపడేస్తుంది అన‌డంలో సందేహం లేదు.

కుంటాల‌కు క్యూ క‌డుతున్న జ‌నం..వానాకాలం వ‌స్తే చాలు జాతీయ రహదారి 44 కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న నేరడిగొండ మండలం కుంటాల జలపాతానికి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. దూర ప్రాంతాల నుండి ప్రకృతి ప్రేమికులు త‌ర‌లి వ‌చ్చి ఇక్కడి అందాలను ఆస్వాదిస్తుంటారు. దీనికి సమీపంలోని బోత్ మండలం పొచ్చెర జలపాతం అందాలు ప్రతి ఒక్కరిని అబ్బురపరుస్తుంది. ఇదే ప్రాంతంలోని కొరటికల్ జలపాతం ప‌ర్యాట‌కుల‌ను సమ్మోహితుల్ని చేస్తోంది.

జాతీయ రహదారి 44కి సమీపంలోనే లకంపూర్, గాజిలి, కోకస్ మన్నూర్, రోల్ మామడకు సమీపంలోని 70 అడుగుల ఎత్తు నుండి జాలువారే గుత్పాల జలపాతాలు సందర్శకుల మదిని దోస్తున్నాయి.

సౌక‌ర్యాల లేక ప‌ర్యాట‌కుల ఇక్క‌ట్లు

ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ప‌ర్యాట‌క ప్రాంతాల్లో సౌక‌ర్యాలు లేక ప‌ర్యాట‌కులు ఇబ్బందులు ప‌డుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొండ కోనల నడుమ జాలువారే జలపాతాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో పర్యాటకులు నిత్యం వ‌స్తున్నారు. టూరిజం శాఖ కనీస వసతులు కల్పించడంలో విఫలమవుతోంది. కుంటాల వద్ద రోప్ వే, వసతి గృహం ఏర్పాటు చేయాలని పర్యాటకులు కోరుతున్నారు. సౌక‌ర్యాలు మెరుగుప‌డితే ప‌ర్యాట‌కుల సంఖ్య పెరిగే అవ‌కాశ ఉంటుంది. పర్యాటక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, కనకాయి, గాజిలి, కోర్టికల్ జలపాతాలకు ప‌ర్యాట‌కుల తాకిడి పెరుగుతోంది.

- Advertisement -

జలపాతాలన్నింటినీ కేంద్రీకృతం చేసి నిర్దిష్ట ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. కుంటాల జలపాతం వద్ద పర్యాటకుల కోసం ప్రత్యేకంగా హట్స్ , రిసార్ట్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నాం. ఇందుకోసం రూ.3.9 కోట్లు మంజూరయ్యాయి. ఐటీడీఏ పర్యవేక్షణలో ఆధునిక సొబగులతో పనులు చేపడతాం. జలపాతం పై భాగంలో రోప్ వే ప్రతిపాదన కూడా అటవీ శాఖ పరిధిలో ఉంది.= ర‌వికుమార్‌, జిల్లా టూరిజం అధికారి

Advertisement

తాజా వార్తలు

Advertisement