అన్‌లిమిటెడ్ నెట్.. అత్యాధునిక 5జి స్మార్ట్ ఫోన్స్‌తో యూత్ అండ్ మూవీ లవర్స్ ఫోన్లలోనే సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దానికితోడు పలు ఓటీటు ప్లాట్‌ఫాంలలో రెండు మూడు వారాల్లోనే కొత్త కొత్త సినిమాలు రిలీజ్ అతున్నాయి. అంతేకాకుండా ఆయా ఓటీటీలు స్వతహాగా రూపొందించే పలు వెబ్ సరీస్‌లు కూడా వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ఈ క్రమంలో నవంబర్‌లో ఏఏ మూవీస్ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయో చదివి తెలుసుకోండి..
నవంబర్‌లో మొత్తం 27 సినిమాలు ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటి వివరాలు..
1 జై భీమ్.. బేస్‌డ్ ఆన్ ట్రూ రియల్ ఈవెంట్స్.. కోర్టు డ్రామా నేపథ్యంలో ఈ మూవీ వచ్చింది. సూర్య లీడ్ రోల్‌లో కనిపిస్తారు. ఈ మూవీ నవంబర్ 2వ తేదీ నుంచి అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది.
2) శ్రీదేవి సోడా సెంటర్.. యాక్షన్ అండ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సుధీర్‌బాబు, ఆనంది లీడ్ రోల్‌లో ఉన్నారు. నవంబర్ 4 నుంచి జీ5 లో స్ట్రీమ్ అవుతోంది..
3) గల్లీ రౌడీ.. యాక్షన్, డ్రామాగా ప్రధానంగా తెరకెక్కిన ఈ మూవీలో సందీప్ కిషన్, నేహాశెట్టి లీడ్ రోల్‌లో ఉన్నారు. నవంబర్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది.
4) ఎంజీఆర్ మగన్.. ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో శశికుమార్, బిర్నాలిని రవి, సత్యరాజ్ లీడ్ రోల్‌లో ఉన్నారు. నవంబర్ 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. (తమిళ వర్షన్ మాత్రమే)
5) మీనాక్షి సుందరేశ్వర్.. రొమాన్స్ డ్రామా ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో అభిమన్యు దాసాని, సన్యా మల్హోత్రా లీడ్ రోల్ చేస్తారు. ఈ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ ఫిల్మ్ నవంబర్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది.
6) అన్ స్టాపబుల్ ఎన్‌బీకే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వస్తున్న కొత్త టాక్ షో ఇది. కొందరు సెలబ్రిటీలను పిలిచి వారితో స్పెషల్ టాక్స్ చేయబోతున్నారు. నవంబర్ 4 నుంచి ఫస్ట్ ఎపిసోడ్ ఆహాలో అందుబాటులో ఉంది..
7) వరుణ్ డాక్టర్.. కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా ఉండే ఈ సినిమాలో శివ కార్తికేయన్, ప్రియాంక మోహన్, యోగిబాబు లీడ్ రోల్‌లో ఉన్నారు. నవంబర్ 5 నుంచి సన్ నెక్ట్స్ లో స్ట్రీమ్ అవుతోంది..
8) కొండపొలం.. అడ్వెంచర్, డ్రామా మెయిన్‌గా రూపొందించిన ఈ మూవీలో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ లీడ్ రోల్.. నవంబర్ లో అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానుంది.
9) మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే లీడ్ రోల్.. ఆహాలో నవంబర్ 19 నుంచి స్ట్రీమ్ కాబోతోంది.
10). మార్వెల్ ఫిలిం షాంగ్‌షీ.. యాక్షన్, అడ్వెంచర్ ప్రధానంగా ఉంటుంది.. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్‌లో స్ట్రీమ్ కానుంది.
11) డిస్నీ ఫిలిం.. జంగిల్ క్రూస్.. యాక్షన్ , అడ్వంచెర్ మెయిన్‌గా ఉంటుంది. డ్వానీ జాన్సన్, ఎమిలీ లీడ్ రోల్.. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్‌లో స్ట్రీమ్ కానుంది.
12) రెడ్ నోటీస్.. యాక్షన్ అడ్వెంచర్ ప్రధానంగా తెరకెక్కింది.. ఒక మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ పట్టుకునేందుకు స్పెషల్ స్పై ఏజెంట్స్ చేసే అడ్వెంచర్ చాలా ఆకట్టుకుంలుంది.. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్‌లో రిలీజ్ అవుతుంది.
13) స్పెషల్ ఓపీఎస్ 1.5.. రా ఏజెంట్లకు సంబంధించిన యాక్షన్ అండ్ అడ్వెంచర్ వెబ్ సిరీస్.. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్‌లో స్ట్రీమ్ కానుంది.
14) కనకం, కామిని, కలహం.. థ్రిల్లర్, డ్రామా మూవీ.. మలయాలంలో ఉంటుంది. నవంబర్‌లోనే డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.
15) హోమ్ స్వీట్, హోమ్ అలోన్.. కామేడీ డ్రామా.. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్‌లో స్ట్రీమ్ కానుంది.
16) ఒక చిన్న ఫ్యామిలీ.. కామెడీ ఫ్యామిలీ డ్రామా.. నవంబర్ 19 నుంచి జీ5లో అందుబాటులో ఉంటుంది
17) ధమాకా.. యాక్షన్, థ్రిల్లర్.. కార్తీక్ ఆర్యన్.. మృణాల్ ఠాగూర్ లీడ్ రోల్.. నవంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ కానుంది.
18) ద వీల్ ఆఫ్ ద టైమ్.. ఫాంటసీ అండ్ యాక్షన్.. నవంబర్ 19 నుంచి అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్..
19) హెల్ బౌన్డ్.. యక్షన్ ఫాంటసీ వెబ్ సిరీస్.. నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ మూవీ.. నవంబర్ 19 నుంచి స్ట్రీమ్ అవుతుంది.
20) వీనమ్.. యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్.. నవంబర్ 22నుంచి స్ట్రీమింగ్ కానుంది.
21) హాక్ ఐ.. మినీ వెబ్ సిరీస్.. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్ 14 నుంచి స్ట్రీమ్ కానుంది.
22) రిపబ్లిక్.. యాక్షన్, పొలిటికల్.. డ్రామా.. సాయితేజ్.. ఐశ్వర్య రాజేశ్ లీడ్ రోల్.. జీ5లో నవంబర్ 26 నుంచి స్ట్రీమ్ అవుతుంది.
23) పెళ్లి సందడి.. రొమాన్స్.. డ్రామా.. రోషన్ శ్రీకాంత్, శ్రీలీల లీడ్ రోల్.. నవంబర్ లోనే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ ఉంటుంది..
24) మహా సముద్రం.. యాక్షన్, డ్రామా.. సిద్ధార్థ్.. శర్వానంద్.. అతిథి రావు హైదరీ లీడ్ రోల్.. నవంబర్ 26 కానీ.. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో కానీ డిజిటల్ స్ట్రీమ్ కానుంది.
25) ఆరడుల బుల్లెట్.. ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్ జోనర్లలో వచ్చిన ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది.
26) అద్భుతం.. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో నవంబర్‌లో స్ట్రీమ్ కానుంది.
27) దృశ్యం-2.. ఫ్యామిలీ డ్రామా.. ఈ నెలాఖరులోగా థియేటర్‌లోకి రానుంది.. ఆ తర్వాత వెంటనే ఓటీటీలోకి వచ్చే చాన్సెస్ ఉన్నాయి.