Wednesday, November 20, 2024

ముగియనున్న నామినేషన్ల పర్వం.. పార్టీల్లో టెన్షన్

తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు నాగార్జునసాగర్ ఉపఎన్నికపై దృష్టి పెట్టాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికకు రేపటితో నామినేషన్ల పర్వం ముగియనుంది. గత మూడు రోజులు ఈసీ సెలవు దినాలుగా ప్రకటించింది. నామినేషన్ దాఖలుకు రేపటి వరకూ మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 20 మంది అభ్యర్ధులు 23 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. తెలంగాణ టీడీపీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ‌బీజేపీ సాగర్ ఇన్‌చార్జ్ ‌కంకణాల నివేదిత రెడ్డి.. తన అభ్యర్థిత్వాన్ని పార్టీ ప్రకటించక మునుపే నామినేషన్ దాఖలు చేసేశారు. రేపు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్‌ను దాఖలు చేయనున్నారు.

మరోవైపు కాంగ్రెస్ నేత జానారెడ్డి ప్రచారంతో దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే ఓసారి నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టేసి వ‌చ్చిన ఆయ‌న‌… హాలియా సభలో త‌న శైలికి భిన్నంగా ప్రసంగం చేశారు. ‘నేను నామినేష‌న్ వేసి ఇంట్లో కూర్చుంటా… మీరు కూడా ఉండండి… జ‌నం ఎవ‌రివైపు ఉంటారో చూద్దాం’ అంటూ స‌వాల్ విసిరారు. ఇక, టీఆర్ఎస్ నుంచి నోముల కుమారుడు భరత్ కే టికెట్ ఖరారు చేశారు. వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీకి‌ మద్దతు ఇచ్చే విషయం, అభ్యర్థుల ప్రకటనపై సాయంత్రానికి ప్రకటన చేసే అవకాశం ఉంది. నామినేషన్ కు ఒక్క రోజు మాత్రమే ఉండడంతో పార్టీల్లో టెన్షన్ నెలకొంది. నేడు, రేపు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే ఛాన్స్ ఉంది. కాగా, ఉపఎన్నిక ఏప్రిల్ 17న జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement