Friday, November 22, 2024

Spl Story | 250 దాటిన టమాటా రేటు.. వామ్మో అంటున్న జనం!

ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో టమాటాలు కిలో రూ. 250 చొప్పున అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న చాలామంది అమ్మో అంటూ షాక్​కు గురవుతున్నారు. అవును.. మీరు చదివింది నిజమే. ఉత్తరకాశీ జిల్లాలో కూడా కిలోకు రూ.180 నుంచి 200 వరకు ధర పలుకుతోంది.

– ఇంటర్నెట్​ డెస్క్​, ఆంధ్రప్రభ

మన వంటకాల్లో రోజూ ఉండాల్సిన టమాట ఇప్పుడు కనిపించడం లేదు. వినియోగానికి తగ్గ సప్లయ్​ లేకపోవడంతో ఒక్కసారిగా టమాటాల రేటు పెరిగిపోయింది. మార్కెట్లో రేటు అగ్గి మండడంతో సామాన్యులు కొనాలంటేనే భయపడుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో డిమాండ్​కి తగ్గట్టుగా దిగుబడి లేకపోవడం, సప్లయ్​లో కూడా తేడా రావడంతో టమాటా ధరల్లో తేడాలొచ్చాయి. అయితే.. ఇప్పుడు టమాట కొనుగోలుపై పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందులో టమాట కొనుగోలు చేసిన వారిపై ఐటీ రైడ్స్​ జరుగుతున్నాయనే విషయాన్ని అయితే ఫన్నీగా క్రియేట్​ చేసి పెద్ద ఎత్తున షేర్​ చేస్తున్నారు.

ఇక.. టమాటాలకు సంబంధించిన ఏ వార్త అయినా ఇట్లే ట్రెండ్ అవుతోంది. దేశవ్యాప్తంగా టమాట ధరల పెరుగుదల విషయంలో కొంతమంది సంతోష పడుతున్నా.. అందరూ తినే ఈ కూరగాయలు వంద రూపాయలను దాటిపోవడంతో చాలామందిలో ఆందోళన నెలకొంది. కాగా, టమోటా ధర విపరీతంగా పెరిగిన ఉత్తరాది రాష్ట్రం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఉత్తరాఖండ్‌లోని గంగోత్రి ధామ్‌లో టమాటాలు కిలో రూ. 250 చొప్పున అమ్ముతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వారు షాక్​కు గురవుతున్నారు. అవును.. మీరు చదివింది నిజమే. ఉత్తరకాశీ జిల్లాలో కూడా కిలోకు రూ.180 నుంచి 200 వరకు ధర పలుకుతోంది. దీంతో టమాటాలు సామాన్యులకు దూరమయ్యాయి.

- Advertisement -

టమాటా ధరలు ఎందుకు ఇంతలా పెరిగాయన్న దానిపై ఆరా తీస్తే.. వర్షాలు లేక, పంటలు పండకపోవడమే కారణంగా తెలుస్తోంది. దేశంలోని టమాటా ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో వేడిగాలుల ఎఫెక్ట్​ ఉందని అందుకే ధర విపరీతంగా పెరిగినట్టు మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, రేట్లు ఎప్పుడైనా తగ్గే అవకాశం ఉందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు.

మెట్రో నగరాల్లో టమాటా ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఢిల్లీలో 120రూపాయలు, ముంబైలో రూ.108, చెన్నైలో రూ.117, కోల్‌కతాలో రూ.152, బెంగళూరులో రూ.105, హైదరాబాద్​లో రూ.100, అహ్మదాబాద్​లో రూ.157 చొప్పున అమ్ముతున్నారు. అయితే.. తమ ప్రజలకు కొంత ఉపశమనం కలిగించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఇప్పుడు చెన్నై వాసులకు నగరంలోని రేషన్ షాపుల్లో రూ.60 రాయితీతో టమోటాలను అందజేస్తుండగా, రిటైల్ మార్కెట్‌లో రూ.100-120 మధ్య విక్రయిస్తున్నారు. పేదలకు, నిరుపేదలకు తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను విక్రయించే దుకాణాల్లో టమోటాలు సబ్సిడీ ధరలకు అందజేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement