Saturday, November 16, 2024

Kitchen: టమోటాలు, ఆరు నెలల దాకా నిల్వ చేసి వాడుకోవచ్చు.. ఎట్లనో తెలుసా!

మొన్నటిదాకా మస్త్​ పిరం అయిన టమోటాలు ఇప్పుడిప్పుడే దిగొస్తున్నాయి. సీజన్​లో దిగుబడి పెరిగిన కొద్దీ డిమాండ్​ తగ్గి రేటు కూడా డౌన్​ అవుతోంది. దీంతో తక్కువ రేటుకి మార్కెట్లలో అందుబాటులో ఉంటున్నాయి. అయితే టమోటా లేకుండా ఈ మధ్య ఏ కూర వండడం లేదు. వాటి అవసరం వంటింట్లో అంతగా పెరిగిపోయింది. అయితే స్టోర్​ చేయడం కష్టమని చాలామంది ఒకటి, రెండు కేజీల కంటే ఎక్కువ కొనకుండా ఉంటుంటారు. కానీ, వాటిని సరిగా ప్యాక్ చేస్తే ఆరు నెలల దాకా స్టోర్​ చేసుకునే చాన్సెస్​ ఉన్నాయి.

ఇట్లా స్టోర్​ చేసుకోవడం వల్ల టమోటాలకు ఎక్కువ రేటు ఉన్నప్పుడు ఖర్చులకి ఇబ్బంది పడకుండా రీ యూజ్​ చేసుకునే అవకాశం ఉంటుంది. టమోటాలను ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే తాజా టమోటాలను తీసుకోవాలి. సైజ్​లో చిన్నవయితే ఇంకా బెటర్​.  ముందుగా టమోటాలను -మంచినీళ్లు లేదా ఉప్పు వేసిన నీళ్లతో శుభ్రంగా కడగాలి. పొడిబట్టతో తుడిచి కాసేపు గాల్లో ఆరబెట్టాలి. -పుచ్చులు ఉన్న వాటిని తీసేయాలి.

ఇక.. టమోటా ముక్కలను తరిగేటప్పుడు మధ్యలోంచి మాత్రమే నిలువుగా కోయాలి. గింజలకు కత్తి టచ్ అవకుండా చూసుకోవాలి. అలా చేస్తేనే టొమాటో పాడు కాదు. ఒకటి రెండు రోజులు ఈ ముక్కల్ని నిల్వ చేయాలనుకుంటే ర్యాప్​ కవర్​లో ముక్కల్ని ఉంచి, గాలి వెళ్లకుండా కవర్​ని ఫోల్డ్ చేయాలి. పది, పదిహేను రోజుల దాకా స్టోర్ చేయాలంటే మాత్రం ముక్కలు తరిగి స్టోర్​ చేసుకోవచ్చు. లేదంటే టమోటాలనే నిల్వ చేయొచ్చు. ముచ్చికలు తీసేసి టొమాటోల్ని జిప్​లాక్​ బ్యాగ్​లో వేయాలి. ఈ జిప్​ను ఒక పక్క నుంచి టైట్ చేయాలి. చివర్లో లోపలకి ఒక స్ట్రా పెట్టాలి. లోపలున్న గాలిని బయటకు పీల్చేయాలి. దీనివల్ల కవర్​లో కొంచెం కూడా గాలి ఉండదు. -ఫ్రిజ్ నుంచి టమోటాలను తీసిన ప్రతిసారీ ఇదే ప్రాసెస్​లో చేయాలి. నాలుగైదు నెలలు నిల్వ ఉంచాలనుకుంటే ఎయిర్ టైట్ బ్యాగ్​లో స్టోర్​ చేసిన పది రోజుల తర్వాత బయటకు తీసి ఫ్రీజర్ బాక్స్​లో ఉంచి మళ్లీ స్టోర్ చేయాలి.

టమోటాలను ఫ్రీజర్ నుంచి బయటకు తీసిన తర్వాత ముక్కలను ఒకలా, టమోటాలను ఒకలా వాడాలి. చాలా రోజుల తర్వాత ఫ్రీజర్ నుంచి బయటకు తీస్తే గట్టిగా, రాయిలా మారతాయి. వెంటనే వండడానికి కుదరదు. మళ్లీ వాటిని నార్మల్ టెంపరేచర్​కు తేవాలి. టమోటాలను బయటకు తీశాక పది నిమిషాలు అలానే ఉంచాలి.  ఇక టమోటా ముక్కలు అయితే 30 సెకన్లు, టమోటాలైతే రెండు నిమిషాలు ఒవెన్​లో ఉంచాలి. ఒవెన్ లేకపోతే మరుగుతున్న నీళ్లలో రెండు నిమిషాలు ఉడికించి, ఆ తర్వాత తొక్కుతీయాలి. సరిగా నిల్వ చేస్తే ఆరు నెలల దాకా టమోటాలు పాడుకాకుండా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement