సోమవారం రాత్రి 10:30 గంటలకు స్పెషల్ ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు యాపిల్ సంస్థ ప్రకటించింది. ఇందులో ఏమేం ప్రోడక్ట్స్ లాంచ్ అవుతాయనే విషయాన్ని వెల్లడించనప్పటికీ.. M1 X మ్యాక్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
ఎయిర్‌పాడ్స్ నెక్ట్స్ జనరేషన్ (ఎయిర్‌పాడ్స్ 3)ని కూడా ఆవిష్కరించవచ్చని తెలుస్తోంది. కొత్త మ్యాక్ బుక్ ప్రో మోడల్స్ సరికొత్త యాపిల్ సిలికాన్ చిప్స్ తో రానున్నాయి. వీటిని యాపిల్ M1 X చిప్ అని పిలుస్తున్నారు. గత ఏడాది విడుదల చేసిన యాపిల్ M1 చిప్సెట్ కంటే ఈ లేటెస్ట్ వెర్షన్ మరింత పవర్‌ఫుల్‌గా ఉండనుంది.
యాపిల్ M1 X చిప్ మోడల్స్ మరింత ప్రొఫెషనల్‌గా, అధిక గ్రాఫిక్స్ సామర్ధ్యం కలిగి ఉంటాయి. ఇవి64 GB RAM వరకు సపోర్ట్ చేసే సామర్ధ్యంతో వస్తాయి. ఈ M1 X చిప్ రెండు రకాలుగా ఉన్నట్టు తెలుస్తోంది. M1 X పవర్‌తో రూపొందించిన యాపిల్ మ్యాక్ బుక్ ప్రో ల్యాప్‌టాప్‌లు 14 ఇంచులు, 16 ఇంచుల స్క్రీన్‌తో రానున్నాయి. 120Hz రీఫ్రెష్ రేటుతో కూడిన మినీ ఎల్ఈడీ డిస్‌ప్లే కూడా ఈ ల్యాప్‌టాప్స్‌లో చూడవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చేఈ ల్యాప్‌టాప్‌లో HDMI పోర్టు కూడా ఉంటుంది.