రెయిన్ బో హాస్పటల్ కి చెందిన ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ తో చేతులు కలిపారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. గుండెజబ్బులతో బాధపడే నిరుపేద చిన్నారులకు తన సేవలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు మహేశ్ బాబు ఫౌండేషన్, ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ ల మధ్య అవగాహన కుదిరింది. దీనికి సంబంధించిన కార్యక్రమంలో మహేశ్ బాబు, రెయిన్ బో హాస్పిటల్ ప్రతినిధులు పాల్గొన్నారు.ఇప్పటికే ఆంధ్రా హాస్పిటల్స్ తో కలిసి హృద్రోగాలతో బాధపడుతున్న చిన్నారులకు కీలక ఆపరేషన్లు ఉచితంగా చేయించడం, భార్య నమ్రతతో కలిసి ఏపీలో బుర్రిపాలెం, తెలంగాణలో సిద్ధాపురం గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడం తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement