ఇద్దరు మహిళలు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని మరీ కొట్టుకున్నారు..బూతులు తిట్టుకున్నారు.ఈ సంఘటన నాసిక్‌లోని పింపాల్‌గావ్ టోల్ ప్లాజా వద్ద చోటు చేసుకుంది. వీరిలో ఒకరు టోల్ ప్లాజా ఉద్యోగి కాగా, మరొకరు ప్రయాణీకురాలిగా కనిపించారు. వైరల్ అవుతున్న ఈ వీడియలో తమ జుట్లను పట్టుకుని మహిళలు గొడవపడ్డారు. తిట్టుకున్నారు. వీరి మధ్య జరుగుతున్న గొడవను ఆపడానికి అక్కడున్న వారు ఆపడానికి ముందే వీరు ఇద్దరూ ఒకరి జుట్టును ఒకరు లాగుతూ.. ఒకరినొకరు చాలాసార్లు కొట్టుకోవడం కనిపించింది. నాసిక్ సమీపంలోని పింపాల్‌గావ్ టోల్ బూత్‌లో మహిళల మధ్య భీకర పోరు చోటుచేసుకుందనీ, జుట్టుపట్టుకుని ఒకరునొకరు దాడి చేసుకున్నారనీ.. ఒక షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది అని ట్విట్టర్ ఆ వీడియోను పోస్ట్ చేశారు.ఈ వీడియోలో చీర కట్టుకున్న ఇద్దరు మహిళలు ఒకరినొకరు పదే పదే కొట్టుకోవడం, దుర్భాషలాడుకోవడం, చెప్పుతో కొట్టుకోవడం వంటి దృశ్యాలు కనిపించాయి. వారిలో ఒకరు మరాఠీలో మాటల వాగ్వాదం మధ్య వారి చీరను చింపివేస్తానని బెదిరించడం కూడా వినబడింది. చాలా సేపు అక్కడున్న వారు ఈ ఫైటింగ్ చూస్తున్నారు. వీడియో చివర్లో, అక్కడున్న వారు జోక్యం చేసుకుని మహిళలను దూరం చేయడం కనిపిస్తుంది. టోల్ రుసుముపై అనుమానంతో ఈ ఘటన జరిగింది.. మొదట వాగ్వాదంతో మొదలై.. చిరవకు ఇలా జుట్టుపట్టుకుని కొట్టుకునే వరకు వెళ్లిందని అక్కడున్న వారు తెలిపారు.
టోల్ ప్లాజా వద్ద ఇద్దరు మహిళల వీరంగం-జుట్టు జుట్టు పట్టుకుని తెగ కొట్టుకున్నారు
Advertisement
తాజా వార్తలు
Advertisement