Friday, November 22, 2024

ఇవ్వాల్టి ముఖ్యాంశాలు.. (Today’s Important News)

  • రాజస్థాన్​ కాంగ్రెస్​ పార్టీలో సంక్షోభం కొనసాగుతోంది. జైపూర్‌లో మొన్న జరిగిన ఎమ్మెల్యేల రాజీనామా వంటి ఘటనల తర్వాత అన్ని కళ్లు ఇప్పుడు మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్‌పైనే ఉన్నాయి. అతను అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తూనే ఎట్లాంటి గాబరా పడకుండా సైలెంట్​గా వెయిట్​ చేయడం కనిపిస్తోంది. పరిస్థితులు తనకు అనుకూలంగా మార్చుకుంటున్నట్టు పొలిటికల్​ అనలిస్టులు చెబుతున్నారు. అందుకే పైలట్​ మౌనాన్ని పాటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక.. భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించే ముందు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఫైనల్​ డెసిషన్​ కోసం వెయిట్​ చేస్తున్నట్టు తెలుస్తోంది.

  • రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ సంతకం చేసిన డిక్రీ ప్రకారం.. మాజీ US సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఎడ్వర్డ్ స్నోడెన్‌కు రష్యా పౌరసత్వాన్ని మంజూరు చేసింది.
  • జపాన్ మాజీ ప్రధాని షింజో అబే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వాల ఉదయం టోక్యో చేరుకున్నారు.
  • రాష్ట్ర జాబితాలో కానీ, కేంద్ర జాబితాలో లేని ఇతర వెనుకబడిన తరగతుల (OBC) వర్గాలకు చెందిన వ్యక్తులు EWS కోటా ప్రమాణాల కింద భారత ప్రభుత్వ పోస్టులు..సేవలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారు తమ సర్టిఫికెట్లను ధ్రువీకరిస్తే డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (DoPT) జాబితాలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) కోసం అందించిన 10% రిజర్వేషన్ల కింద రిక్రూట్మెంట్​కు అర్హులుగా ఉంటారని కేంద్రం తెలిపింది.
Advertisement

తాజా వార్తలు

Advertisement