నేటి బంగారం..వెండి ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.500 పెరిగింది. ప్రస్తుతం రూ.53 వేల 550 మార్క్ వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్ల మేలిమి బంగారం తులానికి రూ.550 మేర పెరిగి రూ.58,420కి చేరింది. ఇక దేశ రాజధాని హస్తినాలో చూసుకున్నట్లయితే బంగారం ధర 22 క్యారెట్లకు తులంపై రూ.500 పెరిగి ప్రస్తుతం రూ.53 వేల 700కు చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం దిల్లీలో రూ.550 పెరిగింది. ప్రస్తుతం రూ.58, 570 వద్దకు చేరింది.
వెండి సైతం బంగారం దారిలోనే పయనిస్తోంది. రోజు రోజుకు భారీగా పెరుగుతూ కొండెక్కుతోంది. గడిచిన వారం రోజుల్లోనే వెండి కిలోకు రూ.5400 మేర పెరిగింది. ఇవాళ ఒక్కరోజే రూ.200 మేర పెరిగి ప్రస్తుతం కిలో వెండి హైదరాబాద్‌లో రూ.72,700 పలుకుతోంది. ఇక దిల్లీలో కిలో వెండి ధర రూ.200 పెరిగి ప్రస్తుతం రూ.69 వేల 200 వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పోలిస్తో దిల్లీలో బంగారం ధర ఎక్కువ, వెండి ధర తక్కువగా ఉంటుంది. అందుకు స్థానికంగా ఉండే ట్యాక్సులు కారణంగా మారుతాయి.