Saturday, November 23, 2024

నేడు స్థిరంగా బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. దీపావళి తర్వాత బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. తిరిగి కాస్త తగ్గినట్టే తగ్గి గత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగుతోంది. నేడు కూడా ఒకరకంగా చెప్పాలంటే బంగారం ధర స్థిరంగానే ఉంది. కేవలం రూ.10 మాత్రమే పెరిగింది. సోమవారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశంలో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ.48,560 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,980 గా ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.61,800 వద్దే కొనసాగుతోంది.


నేడు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు లుక్కేద్దాం :
22, 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) వరుసగా.. హైదరాబాద్‌లో రూ.48,560.. రూ.52,980 విజయవాడలో రూ.48,560.. రూ.52,980 విశాఖపట్నంలో రూ.48,560.. రూ.52,980 ఢిల్లీలో రూ.48,710.. రూ.53,140 ముంబైలో రూ.48,560.. రూ.52,980 చెన్నైలో రూ.49,260.. రూ.53,740 కోల్‌కతాలో రూ.48,560.. రూ.52,980 బెంగళూరులో రూ.48,610.. రూ.53,030 కేరళలో రూ.48,560.. రూ.52,980 లుగా ఉంది.
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,500 విజయవాడలో రూ.67,500 విశాఖపట్నంలో రూ.67,500 ఢిల్లీలో రూ.61,800 ముంబైలో రూ.61,800 చెన్నైలో రూ.67,500 బెంగళూరులో రూ.67,500లుగా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement