నేటితో హీరోయిన్ సమంత సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 12ఏళ్ళు పూర్తయింది. ఈ నేపథ్యంలో ఓ ఎమోషనల్ పోస్ట్ ని ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ రోజుతో చిత్ర పరిశ్రమలో నేను అడుగు పెట్టి 12 సంవత్సరాలు. లైట్లు, కెమెరా, యాక్షన్ , సాటిలేని క్షణాల చుట్టూ తిరిగే 12 సంవత్సరాల జ్ఞాపకాలు. ఈ ఆశీర్వాద ప్రయాణం మరియు ప్రపంచంలోని అత్యుత్తమ, అత్యంత నమ్మకమైన అభిమానులను కలిగి ఉన్నందుకు నేను కృతజ్ఞతతో నిండి ఉన్నాను” అంటూ ట్వీట్ చేసింది సమంత. అందాల ముద్దుగుమ్మ సమంత ‘ఏం మాయ చేసావే’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ రావడం మాత్రమే కాకుండా స్టార్ హీరోల సరసన నటించే అవకాశం కూడా దక్కింది. అలా స్టార్ హీరోల సరసన నటించిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ ల సరసన చేరిపోయింది. సమంత టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే అక్కినేని నాగ చైతన్య ను ప్రేమించి పెళ్ళాడింది. వీరిద్దరికీ కొంతకాలం క్రితమే విడాకులు అయ్యాయి. సమంత విడాకుల తర్వాత తన సినిమాల స్పీడ్ ను మరింతగా పెంచింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement